ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు, నృత్య చరిత్రకారుడు.. విమర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆదివారం గుండెపోటుతో ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
కాగా సునీల్ కు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే నెలరోజుల కిందటే సునీల్ కరోనా బారినపడ్డాడు. అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.
నృత్య విభాగంలో సునీల్ ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. 1995లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు సైతం అందుకున్నారు.
1933 డిసెంబర్ 20న ముంబైలో సునీల్ జన్మించారు. మొదట చార్టడ్ అకౌంటెంట్‌గా ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత భారతీయ నృత్య కళలవైపు మళ్లారు. సుమారు 20కి పైగా పుస్తకాలు రాశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ నృత్యాలపై ఆయన పుస్తకాలు రచించారు.