బిగ్ బాస్ 8 : షటప్.. నేను నీ హౌస్ మెట్ ని కాను.. నాగ్ సూపర్ ఫైర్..!
ఆ గొడవలో ఏం పీకుతావ్ అంటూ గౌతం అనగా.. వాడు వీడు అంటూ పృధ్వి తమ బోర్డర్స్ దాటారు.
బిగ్ బాస్ సీజన్ 8లో ఇన్ని వారాల వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఈరోజు కంటెస్టెంట్స్ మీద చాలా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా గౌతం, పృధ్విల మీద నాగార్జున సీరియస్ అయ్యారు. ఈ వారం జరిగిన మెగా చీఫ్ ఎంపికలో భాగంగా నిఖిల్, రోహిణిలలో ఒకరిని ఆటలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మిగతా హౌస్ మెట్స్ ది కాగా అక్కడ గౌతం రోహిణికి, పృధ్వి నిఖిల్ కి సపోర్ట్ చేశాడు. ఆ టైం లో గౌతం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఓజీ క్లాన్ అంతా కలిసి రాయల్ క్లాన్ ని నామినేట్ చేద్దామని అనుకున్నారు. ఇది గ్రూప్ గేం అంటూ ఎటాక్ చేశాడు.
పృధ్వి దాని మీద గౌతం తో చర్చకి దిగాడు. ఆ గొడవలో ఏం పీకుతావ్ అంటూ గౌతం అనగా.. వాడు వీడు అంటూ పృధ్వి తమ బోర్డర్స్ దాటారు. ఐతే ఈ ఇష్యూపై నాగార్జున ఇద్దరికి క్లాస్ పీకుతున్నాడు. ఐతే గౌతం తో మాట్లాడుతున్న టైం లో నాగార్జున మాట్లాడేది వినకుండా వాదిస్తున్నాడు. అప్పుడు నాగార్జున కూడా గౌతం షటప్.. నేను మాట్లాడేప్పుడు ఎందుకు మాట్లాడతావ్.. నేను నీ హౌస్ మెట్ అనుకుంటున్నావా అని అన్నారు.
నాగార్జున అలా అనేసరికి గౌతం సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత సారీ చెప్పాడు. కాకపోతే నాగార్జున ఇలా ఒక కంటెస్టెంట్ ని షటప్ అనడం ఇదే తొలిసారి. దీనికి కారణం కన్నడ బిగ్ బాస్ లో సుదీప్ అక్కడ కంటెస్టెంట్స్ ని చెడుగుడు ఆడుతున్నాడు. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. మన దగ్గర హౌస్ లో ఎంత పెద్ద ఇష్యూ జరిగినా నాగార్జున ఏదో పైఅపైన మాట్లాడతారన్న టాక్ ఉంది.
ఈ వార్తలు బిగ్ బాస్ టీం దాకా వెళ్లి ఉంటాయి. అందుకే ఈ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున కాస్త ఫైర్ గా కనిపించారు. ఏకంగా నాగార్జుననే విసిగించేలా గౌతం ప్రవర్తన ఉంది. సో మిగతా హౌస్ మెట్స్ కి ఎలా అనిపిస్తుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో నాగార్జున చాలా తక్కువసార్లు హౌస్ మెట్స్ కి క్లాస్ పీకారు.
నాగార్జున బిజీ షెడ్యూల్ వల్ల ఏదో బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప షో చూడరన్న టాక్ ఉంది. ఐతే షో చూసినా చూడకపోయినా తప్పొప్పులను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్ మరో 3, 4 వారాల్లో ముగుస్తుంది అనగా నాగార్జున ఈ రేంజ్ ఫైర్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.