ఒకప్పుడు సినిమాల బడ్జెట్ చాలా తక్కువ ఉండేది. ఆ బడ్జెట్ లో కొన్ని సినిమాలను సాధ్యం అయ్యేది కాదు. భారీ పౌరాణిక కథా చిత్రాలను తీయాలని అనుకున్నా కూడా అప్పటి బడ్జెట్ పరిమితులతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వెనక్కు తగ్గే వారు. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. వెయ్యి కోట్ల వరకు బడ్జెట్ పెట్టినా అంతకు మించి వసూళ్లు నమోదు అవ్వడం కన్ఫర్మ్ అని పలు సినిమాలు నిరూపించాయి. అందుకే భారీ బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు.. చేసేందుకు నిర్మాతలు స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే వెయ్యి కోట్లతో అల్లు వారి రామాయణం రూపొందబోతుంది. అది చర్చల దశలో ఉంది. 2020లో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో మరో మహాభారతం సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీపిక పదుకునే ద్రౌపతి పాత్రలో ఈ చిత్రం రూపొందబోతుందట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. పద్మావత్ చిత్రంతో రాణి పాత్రలో అద్బుతంగా అలరించిన దీపిక పదుకునే ఖచ్చితంగా ద్రౌపతి పాత్రకు అర్హురాలు అని ఆమె అయితేనే చేయగలదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పలు పార్ట్ లుగా ఈ మహాభారత కథను తెరకెక్కించబోతున్నారని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమాను మధు మంతెనతో కలిసి దీపిక నిర్మించనుంది. 2021 దీపావళికి మొదటి పార్ట్ మహాభారతం ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా ఆయన ప్రకటించాడు. ఆయన చెప్పినదాని ప్రకారం అయితే వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే మహాభారతం ప్రాజెక్ట్ ను ప్రకటిస్తే మొదట శ్రీకృష్ణుడు లేదా అర్జునుడు లేదంటే దుర్యోదనుడి పాత్రలను మొదట పరిచయం చేయాలి. కాని ద్రౌపతిగా దీపిక చేస్తుందంటూ ఈ మహాభారతం ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది. అంటే ఈ సినిమా స్టోరీ మొత్తం ద్రౌపతి పాత్ర చుట్టు తిరిగేలా స్క్రీన్ ప్లే నడుస్తుందేమో చూడాలి. ఇప్పటి వరకు ఎన్నో మహాభారత నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో మరి.