సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ పద్మావతి. దీపికా పదుకొనే టైటిల్ రోల్ లో నటిస్తుండగా.. ఆమె భర్త పాత్రలో షాహిద్ కపూర్.. విలన్ రోల్ లో రణవీర్ సింగ్ లు నటించారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ఇప్పుడు ట్రైలర్ విడుదల అయింది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఒక అద్భుతం అనాల్సిందే.
పద్మావతి చిత్రంలో గ్రాండ్ నెస్ ఏ స్థాయిలో ఉండబోతోందో తొలి షాట్ నుంచి ఆఖరి ఫ్రేమ్ వరకూ చూపించాడు దర్శకుడు. సగం ట్రైలర్ పూర్తయేవరకూ కనీసం చిన్న మాట కూడా వినిపించకుండా.. కేవలం మ్యూజిక్ తోనే నడిచిపోయిన విషయాన్ని కూడా మనం గుర్తించలేమంటే.. విజువల్ రిచ్ నెస్.. గ్రాండ్ నెస్ అర్ధమవుతాయి. ఇక పద్మావతి పాత్రకు దీపికా పదుకొనే ప్రాణం పోసేసింది. రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ ఆకట్టుకుంటాడు. కానీ మనకు షాక్ ఇచ్చే పాత్ర అయితే మాత్రం రణవీర్ సింగ్ పోషించిన అల్లావుద్దీన్ ఖిల్లీ పాత్ర అనే చెప్పాలి. రణవీర్ కనిపించిన ప్రతీ ఫ్రేమ్ లోనూ తన క్రూరత్వాన్ని చాటాడు. ఇక యుద్ధ సన్నివేశాలు అయితే ఒళ్లు గగుర్పొడిపించడం ఖాయం. సంగీతం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసేస్తాయి.
మొత్తం మీద అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పద్మావతి ట్రైలర్ ఉంది. మూవీలో కంటెంట్ కూడా ఇంతకు మించి ఉంటుందనే ఆశలు కల్పించింది. డిసెంబర్ 1న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ అవుతుందని ఇండస్ట్రీ జనాలు అంచనా వేస్తోన్నారు.
Full View