వర్మ ఆ విషయం తెలుసుకోవాలట

Update: 2016-02-17 15:30 GMT
రామ్ గోపాల్ వర్మ అంటే కేరాఫ్ సంచలనాలే. ఈయన ఇప్పుడు ఆర్జీవీ టాకీస్ అంటూ ఓ బ్యానర్ స్టార్ట్ చేసేసుకుని, సెక్స్ కంటెంట్ తో రెచ్చగొట్టే రసవత్తర సినిమాలు తీసేందుకు డిసైడ్ అయిపోయాడు. తన మొదటి సినిమాగా సింగిల్ ఎక్స్ అనే మూవీని తీస్తున్నట్లు చెప్పి.. కొన్ని పోస్టర్లు కూడా ఇచ్చాడు. మొదటి పోస్టర్ చూడగానే వర్మ ఏ రేంజ్ లో ఏం చూపించబోతున్నాడనే విషయం అర్ధమైపోయింది. ఇక సెకండ్, ధర్డ్ పోస్టర్ల సంగతి కూడా ఇంతే. ఏ మాత్రం డోస్ తగ్గకుండా.. ఆ రేంజ్ ని మెయింటెయిన్ చేశాడు.

ఆన్ లైన్ లో విడుదల చేయడానికి.. తను చూపించే కంటెంట్ ని సెన్సార్ చేసేవాళ్లు ఎవరూ ఉండరని, ఇంత లెంగ్త్ ఉండాలని కండిషన్స్ కూడా ఉండవని కారణాలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. తన తొలి చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ కి అంకితం ఇస్తున్నానంటూ సంచలనమే సృష్టించాడు. కానీ అందం, అసభ్యం మధ్య అంతరాన్ని వర్మకు తెలియాలంటూ.. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లజ్ నిహలానీ హెచ్చరిక లాంటి కామెంట్ చేశారు.

యూట్యూబ్ లో లిమిట్స్ ఉండకపోవచ్చని, కానీ ఎవరికి వారు కొన్ని పరిమితుల్లోపు ఉండాలని కూడా పహ్లాజ్ చెప్పారు. 'సెన్సార్ అనేది సీబీఎఫ్సీ కోసం.. ప్రతీ భారతీయుని ఆలోచనలను అందుకోవడం కోసం.. ఈ విషయం వర్మ అర్ధం చేసుకుంటే బెటర్' అన్నారు పహ్లాజ్.
Tags:    

Similar News