అవి సెక్సువల్ కిస్సులు.. ఇవి మామూలువి

Update: 2016-11-20 17:30 GMT
మన సెన్సార్ బోర్డు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఎవ్వరికీ అర్ధంకాదు. అందులోనూ సెన్సార్ చీఫ్‌ గా పహ్లజ్ నిహ్లానీ పగ్గాలు పట్టుకున్నాక.. అసలు ఎప్పుడు ఏ సీన్లను కత్తెరిస్తున్నారో.. ఏ సన్ని లియోన్ సీన్లను ఎందుకు లేపేస్తున్నారో.. ఏ ముద్దులను ఎందుకు లెంగ్త్ తగ్గించమంటున్నారో కూడా తెలియని పరిస్థితి. బాలీవుడ్ సినిమాలు ఈయన దెబ్బకు గాట్టి స్ర్టోక్ నే తినేశాయిలే.

ఇకపోతే ఇప్పుడు మనోడు సడన్ గా ప్లేట్ ఫిరాయించి.. ఆదిత్య చోప్రా డైరక్షన్లో రూపొందిన ''బేఫికర్'' సినిమాలో ఏకంగా 23 కిస్సింగ్ సీన్లకూ ఓకె చెప్పేశాడు. ఒక్కటంటే ఒక్క కట్ కాదు కదా.. ఒక్క ఫ్రేమ్ కూడా మనోడు తీసేయమని చెప్పలేదు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఇలా ఒక్క దర్శకుడికి ఒక నిర్మాణ సంస్థకు ఫేవర్లు చేయడమేంటి అంటూ జనాలు ఏకి పాడేయటంతో ఇప్పుడు సెన్సార్ చీఫ్‌ ఒక క్లారిటీ ఇచ్చాడు. వింటనే మనకు కూడా దిమ్మతిరగాల్సిందే.

''బేఫకిర్ సినిమా ఎక్కడో ప్యారిస్ లో జరిగే కథ. అక్కడ సంస్కృతికి అది చాలా కరక్ట్. అందుకే ఆ కిస్సులను తొలిగించలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో (ఏ దిల్ హై ముష్కిల్ అనుకోండి) కిస్సుల నిడివి ఎందుకు తగ్గించామంటే.. అవి చాలా శృంగారభరితంగా ఉన్నాయి. సెక్స్ కు దారి తీసే ముద్దులు అవి. కాని బేఫికర్ లో మాత్రం కేవలం ప్రేమానురాగాలు పంచేందుకే కిస్సులను వాడారు'' అంటున్నాడు పహ్లజ్ నిహ్లానీ.

ఏవండీ ఈయనకు బ్రెయిన్లో ఏమన్నా ఫీజ్ కొట్టేసిందా లేకపోతే మనకు పువ్వులు పెడుతున్నాడా.. అవతల బేఫికర్ సినిమాలో బట్టలిప్పేసి రచ్చ చేస్తూ హీరోయిన్ వాణి కపూర్ భారీగా అందాలను ఆరబోస్తూ హీరో రణవీర్ సింగ్ పెదాలను జుర్రేస్తుంటే.. అవి ప్రేమానురాగాలు అంటాడేంటి? పైగా ఈ ముద్దులు ప్యారిస్ కల్చర్ అయితే.. మరి జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా ముద్దులు వారి కల్చరే కదా.. అప్పుడెందుకు కటింగ్ వేశావ్ దొరా??

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News