సినిమా ప్రచారం కోసం ఫిలిం మేకర్స్ ఎంతకైనా దిగజారుతారనడానికిది రుజువు. తమ సినిమాలోని సన్నివేశాల్ని ఎవరో లీక్ చేసేశారంటూ గగ్గోలు పెట్టిన ఓ చిత్ర బృందం.. ప్రచారం కోసం తామే ఈ సన్నివేశాల్ని లీక్ చేసిన విషయం బయటపడిపోయేసరికి ఏం చేయాలో తోచక తల దించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ మధ్య స్వర భాస్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘అనార్కలి ఆఫ్ ఆరా’ అనే సినిమా నుంచి కొన్ని న్యూడ్ సీన్లు బయటికి రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. స్వర భాస్కర్ బ్యాక్ లెస్ గా ఉన్న ఆ సన్నివేశాల్ని సెన్సార్ వాళ్లు సినిమా నుంచి కట్ చేశారని.. ఎవరో వాటిని లీక్ చేసేశారని చిత్ర బృందం వాపోయింది. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
ఐతే ఈ చిత్ర బృందమే ప్రచారం కోసం ఆ సన్నవేశాల్ని ఇంటర్నెట్లో లీక్ చేసిందని ఇప్పుడు వెల్లడైంది. అసలు ఈ చిత్రానికి ఇంకా సెన్సారే పూర్తి కాలేదట. తాము సెన్సార్ సర్టిఫికేటే ఇవ్వలేదని.. మరి సెన్సార్ డెలీటెడ్ సీన్లంటూ ఎలా బయటికి వస్తాయని సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ ప్రశ్నించడంతో చిత్ర బృందం గుట్టు బయటపడింది. సినిమాకు అనుకున్నంత బజ్ రాకపోవడంతో చిత్ర బృందమే ఈ న్యూడ్ సీన్లను లీక్ చేసి హైప్ తీసుకురావడానికి ప్రయత్నించిన సంగతి ఇప్పుడందరికీ అర్థమైంది. ఇది పబ్లిసిటీ గిమ్మిక్కు తప్ప మరేమీ కాదని తేలింది. ఎలాగైతేనేం పరువు పోయినా.. సినిమాకు ప్రచారం అయినా దక్కిందని సంతోషిస్తోందేమో ఈ చిత్ర బృందం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/