బాహుబలిని పాకిస్తాన్ పంపిస్తావా గురూ?

Update: 2017-05-01 09:51 GMT
ఆల్రెడీ ఆయనకు పాకిస్తాన్ నుండి మన దేశానికి నటులను ఇంపోర్ట్ చేసిన గొప్ప క్రెడిట్ ఉంది. జస్ట హ్యాండ్సమ్ గా ఉన్న హీరోలను.. కత్తిలాంటి హీరోయిన్లను.. మనోడు అక్కడి నుండి ఇక్కడకు దించుతుంటాడు. అతడే కరణ్‌ జోహార్. అందుకే కదా.. ఏ దిల్ హై ముష్కిల్ సమయంలో నానా రచ్చ జరిగింది. చివరకు సినిమాలో ఫవాద్ ఖాన్ రోల్ పూర్తి స్థాయిలో కట్ చేస్తే కాని సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వలేదు. ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు బాహుబలి కోసం డిమాండ్లు వచ్చేస్తున్నాయి.

మామూలుగా హిందీ వర్షన్ రిలీజ్ అంటే జస్ట్ బాలీవుడ్ లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా కరణ్‌ జోహార్ బాహుబలి 2 హిందీ వర్షన్ ను గ్రాండ్ గానే రిలీజ్ చేశాడట. అయితే అన్ని దేశాలకూ సినిమాను ఇచ్చాడు.. వుయ్ మీన్.. అమ్మేశాడు కాని.. పాకిస్తాన్ కు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు సినిమా గ్రాండ్ రేంజ్ సక్సెస్ చూశాక అక్కడి డిస్ర్్టిబ్యూటర్లు అండ్ ప్రేక్షకులు మాక్కూడా సినిమా పంపించు గురూ అంటూ డిమాండ్ చేస్తున్నారట. మరి మనోడు ఇస్తాడా? అయినా కూడా ఇస్లామిక్ దేశం అయిన పాకిస్తాన్.. పూర్తి స్థాయి హిందూ తత్వం.. భారతీయ కథాచిత్రంగా ఉన్న బాహుబలి 2 రిలీజ్ కు పర్మిషన్ ఇస్తుందా? అసలు సినిమాలోని భారతీయత్వాన్ని పాక్ బాబులు జీర్ణించుకోగలరా??

ఏదేమైనా కూడా కరణ్‌ జోహార్ ఆల్రెడీ ఒకసారి పాకిస్తాన్ నటీనటుల ఇష్యూతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మళ్లీ అనవసరంగా ఈ విషయంలో వేలు పెడతాడంటారా? చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News