దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "ఆర్.ఆర్.ఆర్" చిత్రం బాక్సఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఈ పీరియాడిక్ ఫిక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
RRR మూవీ అక్టోబరు 21న జపాన్ లో విడుదలై తొలి వారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించించింది. అయితే 2022 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ఇప్పుడు ఒక పాకిస్థానీ సినిమా బీట్ చేసిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' అనే పాకిస్తానీ సినిమా ఇటీవలే విడుదలైంది. బ్రిటన్ లో ఈ చిత్రం 'RRR' కలెక్షన్లను కేవలం 17 రోజుల్లోనే అధిగమించినట్లుగా పాక్ మీడియా పేర్కొంటోంది. అయితే ఈ మూవీ ఎంత వసూలు చేసిందనేది మాత్రం వెల్లడించలకపోవడం గమనార్హం.
ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా బ్రిటన్ లో రూ.100 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' సినిమా పాకిస్తానీ కరెన్సీలో ఇప్పటి వరకు 150 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అఫిషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
వరల్డ్ వైడ్ గా 150 కోట్లు రాబట్టిన పాకిస్థానీ సినిమా.. RRR చిత్రాన్ని బీట్ చేయడం అంటే.. ఒక్క బ్రిటన్ లోనే 100 కోట్లకు పైగా రాబట్టినట్లు అర్థం. దీన్ని బట్టే పాకిస్తాన్ మీడియా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' వసూళ్లను ఫేక్ చేస్తోందని చెప్పొచ్చు.
భారతదేశానికి చెందిన '' సినిమాను బ్రిటన్‌లో పాకిస్తాన్ కు చెందిన 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' బీట్ చేసిందంటూ వస్తున్న వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పాక్ సినీ అభిమానులు ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ఖుషీ అవుతున్నారు.
బీట్ చేసిందని అంటున్నారు కానీ.. ఎంత కలెక్ట్ చేసిందని చెప్పకపోవడాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఫేక్ చేస్తూ.. సోషల్ మీడియాలో అతి చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ సినిమా ఇప్పుడు ప్రపచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతుండం చూసి.. పాక్ కుళ్లుతో ఇలా చేస్తోందని ఇండియన్ సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మన సినిమా 'బడ్జెట్' అంత కూడా వసూలు చేయని పాక్ చిత్రం గురించి చర్చ ఎందుకు అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఇలా ఫేక్ వార్తలు ప్రచారం చేసి ఆనందించడం కంటే.. మంచి చిత్రాలు తీసి భారతీయ సినిమాతో పోటీ పడాలని సూచిస్తున్నారు.
ఇకపోతే ''ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్" చిత్రాన్ని 'గ్లాడియేటర్' తరహాలో రూపొందించే ప్రయత్నం చేశారు. ఇది 1979 నాటి పాకిస్తానీ సినిమా 'మౌలా జాట్' ఆధారంగా తీసిన సినిమా అని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.