షాకింగ్: హత్యకేసు నిందితుడిగా మారిన అగ్రహీరో

Update: 2020-04-19 10:13 GMT
బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ ఒక హత్యకేసు నిందితుడు అంటూ మీడియాలో ప్రసారం కావడం కలకలం రేపింది. అయితే ఇది జరిగింది భారత్ లోకాదు.. పాకిస్తాన్ లో.. పాకిస్తాన్లోనూ అమీర్ ఖాన్ కు మార్కెట్ ఉంది. అక్కడ అమీర్ సినిమాలు బాగా ఆడుతాయి. అలాంటి అమీర్ ఖాన్ హత్యకేసులో నిందితుడిగా ఒక ప్రముఖ చానెల్ మార్చేసింది.ఇది కలకలం రేపింది.

పాకిస్తాన్ లో ఎంక్యూఎం నేత అమీర్ ఖాన్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 17 ఏళ్ల తర్వాత వచ్చిన తీర్పులో ఈ హత్యతో అమీర్ ఖాన్ కు సంబంధం లేదని కోర్టుతీర్పు వెల్లడించి అతడిని విడుదల చేసింది.

అయితే ఆ వార్తను ప్రసారం చేసే క్రమంలో పాకిస్తాన్ లోని ప్రముఖ టీవీ చానెల్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఫొటోను వాడేసింది. ఇది పాకిస్తాన్ లో తీవ్ర కలకలం రేపింది. అభిమానులు పెద్ద ఎత్తున చానెల్ కు ఫోన్లు చేసి నిలదీశారు. వెంటనే తీసేయాలని కోరారు. తప్పు తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ వార్త వైరల్ గా మారి సోషల్ మీడియాలో.. భారత్ లోనూ వ్యాపించింది.

ఇలా అమీర్ ఖాన్ హత్య కేసులో నిందితుడా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పాకిస్తాన్ చానెల్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై హీరో అమీర్ ఖాన్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.


Tags:    

Similar News