మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తొలిసారి కలిసి నటించిన చిత్రం 'ఆచార్య' ఈ శుక్రవారం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు చిరు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుండటంతో 'ఆచార్య'పై ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పైగా ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించడం, వరుస సూపర్ హిట్ లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ నుంచి దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో 'ఆచార్య'పై అంచనాలు ఏర్పడ్డాయి.
భారీ అంచనాల మధ్య మొత్తానికి ఈ శుక్రవారం ఏప్రిల్ 29న 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని ఆకట్టుకోలేకపోతోంది.
దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ విషయంలో చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. ఇదిలా వుంటే ఈ చిత్రంలో విలన్ గా కీలక పాత్రలో నటించారు రియల్ హీరో సోను సూద్. ఆయన కటౌట్ లకు 'ఆచార్య' థియేటర్ల వద్ద అభిమానులు పాలాభిషేకం చేస్తుండటం విశేషం.
కోవిడ్ టైమ్ లో ప్రత్యక్ష దైవంగా నిలిచారు సోను సూద్. ప్రభుత్వాలు చేతులెత్తేస్తే దేశ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా క్షణాల్లో తీరుస్తూ ఆదర్శంగా నిలిచారు. కరోనా మహామ్మరి ప్రబలుతూ జన జీవితాన్ని అస్థావ్యస్తంగా మారుస్తూ కబలిస్తుంటే మధ్య తరగతి, ఆ దిగువ తరగతి ప్రజలు ఆహా కారాలు చేశారు. ప్రభుత్వాలు చేతలు ఎత్తేయడంతో రంగంలోకి దిగిన సోనుసూద్ అన్నీ తానై ముందుండి ఆపద అన్న ప్రతీ ఒక్కరికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు.
దేశ వ్యాప్తంగా వున్న వలస కూలీకు దేవుడిగా మారి వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారు, అంతే కాకుండా భువనేశ్వర్ కు ప్రత్యేకంగా ఓ ఫ్లైట్ నే ఏర్పాటు చేసి మహిళా కార్మికుల్ని ఇంటికి చేర్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. దీంతో సోనూ సూద్ ఒక్కసారిగా నేషన్ వైడ్ గా రియల్ హీరోగా మారిపోయారు. సోనూ సహాయం పొందిన వారు.. పొందని వారు కూడా ఆయనకు జే జేలు కొడుతూ గుడులు కట్టడం విశేషం.
ఇదిలా వుంటే తాజాగా 'ఆచార్య' మూవీ రిలీజ్ కావడంతో ఈ చిత్రంలో విలన్ గా నటించిన సోనూ సూద్ కటౌట్ కు హైదరాబాద్ శాంతి థియేటర్ అభిమానులు పాలాభిషేకం చేశారు. ఇందు కోసం భారీ కటౌట్ ని ఏర్పాటు చేసిన అభిమానులు అనంతరం ఆ కటౌట్ కు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో పరస్తుతం నెట్టింట వైరల్ గా మారి సందడి చేస్తోంది. ప్రస్తుతం సోను సూద్ తమిళంలో 'తమిళరసన్', హిందీలో పృథ్వీరాజ్, ఫతే చిత్రాల్లో నటిస్తున్నారు.

The #SonuSood Phenomenon continues as the fans pour their love on the real hero once again! Such feat is rarely achieved by few super stars! @SonuSoodpic.twitter.com/RvRcwa6b37
— ᴊᴀɢᴀᴅɪꜱʜ