కొంతమంది దర్శకులు ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే వీలైనంత త్వరగా మరొక సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటారు. గ్యాప్ వస్తే కెరీర్ పై ప్రభావం పడుతుంది అనే ఆలోచనతో కూడా ఉంటారు. కానీ కుమారి 21ఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు సూర్య ప్రతాప్ మాత్రం రెండవ సినిమా కోసం చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది.
అతను మొదట కొన్ని సినిమాలకు సహాయక దర్శకుడిగా పనిచేసి సుశాంత్ తో కరెంట్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మళ్లీ అతనికి మరొక అవకాశం దొరకలేదు. కానీ ఆ తర్వాత సూర్యప్రతాప్ సుకుమార్ దగ్గర సహాయక దర్శకుడిగా మారిపోయాడు. అలాగే సుకుమార్ సినిమాలకు అతను తరచుగా రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తూనే ఉన్నాడు.
అయితే సుకుమార్ నిర్మాతగా మారి సొంతంగా కథలు అందిస్తూ తన శిష్యులను మంచి అవకాశాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదటి సినిమా కరెంటుతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా సూర్యప్రతాప్ టాలెంట్ ను నమ్మి సుకుమార్ కుమారి 21ఎఫ్ కథను అతనికి ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది.
అయితే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా సూర్యప్రతాప్ వెంటనే మరొక సినిమా చేయకుండా సుకుమార్ తోనే రంగస్థలం పుష్ప సినిమాలకు రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. అయితే రంగస్థలం సక్సెస్ అయిన తర్వాత సుకుమార్ 18 పెజెస్ అనే మరొక కథను ఈ దర్శకుడికి అందించాడు. ఇక అతను కరోనా లాక్ డౌన్ కంటే ముందే ఈ సినిమాను మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత వివిధ కారణాల వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ఇక మొత్తానికి ఇప్పుడు 18 పెజెస్ డిసెంబర్ లో విడుదలకు సిద్ధమతొంది. కుమారి 21ఎఫ్ విడుదలైన ఏడేళ్ల తర్వాత సూర్య ప్రతాప్ నుంచి ఒక సినిమా వస్తోంది. ఒక బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న దర్శకుడు ఇంత పెద్ద గ్యాప్ తీసుకోవడం ఇండస్ట్రీలో మొదటిసారి అయ్యి ఉంటుంది. అయితే ఈ సినిమాపై ప్రస్తుతం అయితే పెద్దగా బజ్ లేదు. డిసెంబర్ 23న పెద్దగా పోటీ లేని సమయంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ సమయంలో సినిమా ఎలాంటి సక్సెస్ అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.