బాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. స్టార్లు అంతా ఇప్పుడు సౌత్ వైపు చూస్తున్నారు. ఇక్కడ ప్రతిభను వెతుకుతున్నారు. ఇది నిజంగా ఊహించని కొత్త పరిణామం. ఇన్నాళ్లు ఖాన్ ల త్రయం అంటూ గొప్పలు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. బాలీవుడ్ ని ఏల్తున్న దిగ్గజ కంపెనీలు సైతం సౌత్ సినిమాని ఆశ్రయిస్తున్నాయంటే సన్నివేశం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇటీవల కింగ్ ఖాన్ షారూక్ మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయింది. అతడు కమర్షియల్ సినిమా మైండ్ సెట్ ని వెతుకుతున్నాడు.
అదే క్రమంలో తమిళ దర్శకుడు అట్లీతో షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం సౌత్ కి వచ్చాడు. అయితే బాలీవుడ్ ని కాపాడటానికి ఖాన్ ఎంచుకున్న మార్గం అదొక్కటేనా? అంటూ కూడా విశ్లేషణ సాగుతోంది. దశాబ్ధాల పాటు కింగ్ లా ముంబై పరిశ్రమను ఏలిన షారూక్ ఆలోచనల్లో ఇంతటి పెనుమార్పులు ఊహించనివి అంటూ గుసగుస వినిపిస్తోంది.
సౌత్ సినిమాలు బాలీవుడ్ రిలీజ్ లను బాక్సాఫీస్ వద్ద కిల్ చేస్తున్న తరుణంలో షారుక్ ఖాన్ ఆలోచన మారిందని టాక్ వినిపిస్తోంది. జవాన్ కోసం తమిళ దర్శకుడు అట్లీని ఎంపిక చేసుకుని .. దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరైన నయనతారతో కలిసి నటించేందుకు ప్రేరేపించిన ఏకైక కారణం అతడిలోని పెనుమార్పు అని చెబుతున్నారు. దర్శకుడు అట్లీతో షారుఖ్ జవాన్ కోసం చేతులు కలిపాడు. ఈ చిత్రం 2023 జూన్ 2న థియేటర్లలో విడుదల కానుంది.ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నయనతార నాయికగా నటించడం ఖాన్ కి ప్లస్ కానుంది.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ లో ఎందుకింత మార్పు అంటే వరుస పరాభవాలే కారణం అనడంలో సందేహం లేదు. అతడు చివరిసారిగా 2018లో 'జీరో'లో కనిపించారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. SRKని అభిమానులు పెద్ద స్క్రీన్ పై చూసి దాదాపు నాలుగు సంవత్సరాలు అయ్యింది. అదే క్రమంలో ఖాన్ తన ఆలోచనలు మార్చుకుని తెలివైన ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కో జానర్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం కూడా ఇందులో భాగమే. వాటిలో ఒకటి.. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ జవాన్.
సౌత్ సినిమాలు బాలీవుడ్ విడుదలలను బాక్సాఫీస్ వద్ద ఎటాక్ చేస్తున్న సమయంలో SRK జవాన్ వస్తోంది. పుష్ప: ది రైజ్- RRR-KGF చాప్టర్ 2 సంచలన విజయాలు ఖాన్ ముందు బిగ్ ఛాలెంజ్ ని ఉంచాయి. నిజానికి ఇటీవల విడుదలైన కొన్ని హిందీ సినిమాలు ఘోరపరాజయం పాలవ్వడం కూడా ఖాన్ లో ఆలోచనలను మార్చేసిందని గుసగుస వినిపిస్తోంది. అందుకే ఖాన్ చాలా ఆచితూచి తెలివిగా ఆలోచిస్తున్నారని ముంబై మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
2018లో షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో జతకట్టబోతున్నాడని పుకార్లు వచ్చాయి. వీరిద్దరూ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ని వీక్షించే క్రమంలో ఈ కలయిక కుదిరింది. మ్యాచ్ ముగిసిన తర్వాత SRK చెన్నైలోని అట్లీ కార్యాలయాన్ని సందర్శించారు. దీనికి ముందే ఖాన్ చాలా తర్జనభర్జన పడ్డారు. బాహుబలి సిరీస్ విజయం తర్వాత షారూఖ్ ఆ ఫార్ములాను విశ్లేషించారట. పాన్-ఇండియా చిత్రాల భవిష్యత్తు ఇకపై కొనసాగనుందని ఊహించాడని గుసగుస వినిపిస్తోంది. అందుకే కొత్త దారులు తెరిచి అవకాశాలను అన్వేషించాలనుకున్నాడు. దళపతి విజయ్ కి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన అట్లీ కంటే మార్కెట్ లో వేరొకరు ఎవరు బెస్ట్ అని కూడా వెతికాడట. కానీ చివరికి అట్లీ వినిపించిన జవాన్ కథ కార్యరూపం దాల్చింది. దానికోసం కొన్ని సంవత్సరాలు పట్టినప్పటికీ పాన్-ఇండియా కథను లాక్ చేశాడు.షారుఖ్ రొటీన్ బాలీవుడ్ కథల స్థానంలో యాక్షన్ ఉన్న చోటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని అతడి చర్య చెబుతోంది. అలా అట్లీతో కలయిక కుదిరింది.
ఇటీవల రణబీర్ 'బ్రహ్మాస్త్ర' లాంటి ఫాంటసీ డ్రామాను ఎంచుకోగా.. షారూక్ ఇంకా విభిన్నంగా ఆలోచించాడు. ఇక రణబీర్ సౌత్ లో కేవలం ప్రమోషన్ లతో స్పీడ్ పెంచాలనుకుంటే.. షారూక్ అంతకు మించి ఇంకా ఏదైనా చేయాలనుకుంటున్నారట. అతను దక్షిణాది సెన్సిబిలిటీలను తెరపై చూపించాలని భావించారని సమాచారం. జవాన్ లో ఇది కనిపిస్తుందని కూడా చెబుతున్నారు. అతను జవాన్ ప్రమోషన్ కోసం ఎంతవరకూ అయినా వెళతాడట. ఇకపై రణబీర్ లానే అతడు తెలుగు రాష్ట్రాల్లో టూటైర్ సిటీల్లో ప్రచారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. జవాన్ ఇతర బాలీవుడ్ చిత్రాలకు భిన్నంగా దక్షిణాదితో బలమైన అనుబంధాన్ని కలిగి ఉందని తెలుస్తోంది. కోలీవుడ్ లో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో అట్లీ ఒకరు. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లతో అట్లీ దర్శకుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. నాలుగు చిత్రాలలో మూడు పరిశ్రమలో అత్యంత పాపులర్ స్టార్లలో ఒకరైన దళపతి విజయ్ నటించారు. అంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని హ్యాండిల్ చేసిన అనుభవం అట్లీకి ఉంది. అట్లీ కథలు విలక్షణమైన ఎంటర్ టైనర్ లు గా అలరించాయి.అందుకే అతడిని ఖాన్ ఎంపిక చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. జవాన్ ను తమిళం- తెలుగు- మలయాళం- కన్నడ భాషలలో మార్కెట్ చేయడానికి కింగ్ ఖాన్ విస్తృతమైన ప్రణాళికతో ముందుకు వస్తాడన్న గుసగుస వినిపిస్తోంది.
బాలీవుడ్ కి పాన్ ఇండియా హిట్ కావాలి. జవాన్ అది సాధిస్తుందా? అన్నదానికి కాలమే సమాధానం చెపపాలి. ఇటీవలి కాలంలో అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ లాంటి స్టార్లు ఇది సాధించలేకపోయారు. సామ్రాట్ పృథ్వీరాజ్ - రన్‌వే 34 చిత్రాలు ప్రేక్షకులను థియేటర్ లకు ఆకర్షించలేకపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి రణబీర్ కపూర్-అలియా భట్ ల బ్రహ్మాస్త్ర పైనా.. కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న జవాన్ పైనా ఉన్నాయి.
సౌత్ సినిమాలు దాదాపు రూ. 1000 కోట్లు (RRR - KGF 2) వసూలు చేస్తుంటే ఇటీవలి హిందీ సినిమాలు రూ. 100 కోట్లు అంతకంటే తక్కువ వసూలు చేస్తున్నాయి. ఇది ఒకరకంగా హిందీ పరిశ్రమ పరువు తీసింది. అందుకే ఆ పరువును నిలబెట్టేందుకు కింగ్ ఖాన్ ఇప్పుడు సరికొత్తగా ఆలోచిస్తున్నాడని విశ్లేషిస్తున్నారు. జవాన్ తో పాటు ఖాన్ నటిస్తున్న పఠాన్ ని కూడా భారీగా సౌత్ లో విడుదల చేసే ఆలోచన ఉందని తెలిసింది.