ఇటీవల స్టార్ హీరోలు భారీ డిజాస్టర్ లని చూసిన విషయం తెలిసిందే. ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఎలాగైనా మళ్లీ ట్రాక్ లోకి రావాలని, అంతకు మించిన ఎంటర్ టైన్ మెంట్ తో పాటు యాక్షన్ ట్రీట్ ని అభిమానులకు, ప్రేక్షకులకు అందించాలని స్టార్ హీరోలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల 'రాధేశ్యామ్' మూవీతో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొని ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రభాస్ తన తదుపరి చిత్రంతో యాక్షన్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాడట.
ప్రస్తుతం ప్రభాస్ 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై 'కేజీఎఫ్' ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'కేజీఎఫ్' సిరీస్ మూవీస్ తరహాలోనే మైన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'బాహుబలి' తరువాత 'సాహో' పరవాలేదనిపించినా 'రాధేశ్యామ్' ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలవడంతో ప్రభాస్ ఆశలన్నీ 'సలార్'పైనే పెట్టుకున్నాడట.
ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె వంటి చిత్రాల్లో నటిస్తున్నా తన దృష్టి మాత్రం ఎక్కువగా 'సలార్'పైనే వుందని తెలుస్తోంది. 'కేజీఎఫ్'లో యాక్షన్ సీక్వెన్స్ లు, యష్ కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన బిల్డప్.. యష్ స్వాగ్ ఓ రేంజ్ లో పేలాయి. అలాంటి సీన్ లే తనకు కావాలని, మోర్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని ప్రభాస్ అడుగుతున్నాడట. అయితే ఇటీవల 'సలార్' షూటింగ్ లో జరిగిన ప్రమాదం కారణంగా ప్రభాస్ కు మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది.
అలాగే వెన్నుకు సంబంధించిన మైనర్ సర్జరీ కూడా జరిగింది. ఈ రెంగు విషయాలని దృష్టిలో పెట్టుకుని మోర్ యాక్షన్ కంటే బిల్డప్ షాట్స్, స్వాగ్ సీన్స్ తో సరిపెట్టేద్దామని ప్రశాంత్ నీల్ చెబుతున్నారట.
అయితే నాకు వచ్చిన ప్రాబ్లమ్ ఏమీ లేదని, ఇంటెన్స్ యాక్షన్ సీన్ లని మరింతగా పెంచితే బాగుంటుందని ప్రభాస్ కోరుతున్నాడట. ఈ సీన్ లతో ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతారని, అంతే కాకుండావారి ఎక్స్ పెక్టేషన్స్ ని కూడా రీచ్ అయినట్టుగా వుంటుందని ప్రభాస్ అంటున్నాడట.
ప్రశాంత్ నీల్ మాత్రం ప్రభాస్ రిస్క్ చేస్తే ఎలా అని ఆలోచిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ప్రశాంత్ నీల్ ని ఒప్పించి ప్రభాస్ ఏ రేంజ్ లో ప్రేక్షకులకు, అభిమానులకు యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ మూవీ కీలక ఘట్టాల చిత్రీకరణ ఇటీవలే మొదలైంది.