`రాధే శ్యామ్` రాక కోసం ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు పైగానే అయ్యింది. 2019లో సాహో రిలీజ్ కాగా అప్పటికి రెండేళ్ల ముందు నుంచే రాధా కృష్ణ స్క్రిప్టు రెడీ చేసి డార్లింగ్ అనుమతి కోసం వేచి చూశారు. రాధాకృష్ణ తొలి మూవీ `జిల్`(గోపిచంద్ తో) 27 మార్చి 2017లో రిలీజైంది. ఆ తర్వాత ప్రభాస్ కోసం స్క్రిప్టును రెడీ చేశారు రాధాకృష్ణ. అప్పటి నుంచి ఇప్పటికి సుమారు ఐదేళ్లు అయ్యింది. కానీ ఇంకా తన కెరీర్ రెండో సినిమా రిలీజ్ కానేలేదు. దాదాపు మూడేళ్ల పాటు సుదీర్ఘంగా రాధేశ్యామ్ నిరీక్షణ అతడి ఫాలోవర్స్ కి నిజంగా షాకిచ్చేదే.
గడిచిన రెండేళ్లలో ఇప్పటికి కరోనా మహమ్మారీ రెండు సార్లు భీభత్సం సృష్టించింది. అనూహ్యంగా శత్రు దేశం నుంచి మన దేశంలో ప్రవేశించిన కరోనా తాకిడికి సినీపరిశ్రమలు అల్లాడాయి. అలాగే ఇతర భారీ ప్రాజెక్టులతో పాటు రాధేశ్యామ్ లాంటి ప్రతిష్ఠాత్మక సినిమా మేకింగ్ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లింది. దేశవిదేశాల్లో తెరకెక్కించాల్సిన ఈ సినిమా కాన్వాస్ ని అనూహ్యంగా మార్చాల్సి వచ్చింది. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. ప్రభాస్ దాదాపు సినిమా పూర్తి చేసే దశలో ఉన్నాడు. ఈ చిత్రం జూలై 30 న విడుదల కావాల్సి ఉండగా.. రెండవ వేవ్ కారణంగా వాయిదా పడింది.
పీరియడ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వీఎఫ్ ఎక్స్ అత్యంత కీలకం కానుంది. టాకీ పూర్తయినా.. చాలా వరకూ వీఎఫ్ ఎక్స్ అవసరం. ఈ పనులు అంతకంతకు ఆలస్యమవుతూనే ఉన్నాయి. దానికి కారణం స్వదేశంతో పాటు విదేశాలలోనూ ఎక్కువ పనులు జరుగుతున్నాయి. కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ పని అంతకంతకు ఆలస్యమైంది. నిర్మాణానంతర పనులు వేగంగా పూర్తవ్వకపోవడంతో రాధేశ్యామ్ రిలీజ్ తేదీ అంతకంతకు వాయిదా పడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకూ రాధేశ్యామ్ కి సంబంధించిన ఏవో కొన్ని టీజర్లు పోస్టర్లను రిలీజ్ చేయడమే కానీ సరైన ప్రమోషన్ లేదనే చెప్పాలి. అభిమానులకు పాటల విందు కావాలి. మరిన్ని టీజర్ల విందు.. మేకింగ్ విజువల్స్ తో వేడి పెంచాల్సి ఉంటుంది. కానీ అవేవీ జరగలేదంటే ఈ మూవీ రిలీజ్ తేదీపై ఇంకా సందిగ్ధత నెలకొనడమే ప్రచారం లేకపోవడానికి కారణమని అంతా భావిస్తున్నారు.
బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్.. రాధేశ్యామ్ గ్లింప్స్ అంటూ ఇప్పటికీ యూట్యూబ్ లో అవే కనిపిస్తున్నాయి కానీ ట్రైలర్ ఇంకా రానే లేదు. ఇక ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీగా రాధేశ్యామ్ ట్రెండ్ కాలేకపోవడానికి ప్రచారంలో లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయడం ప్రధాన కారణమని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ఇక కనీసం రిలీజ్ పై క్లారిటీ వచ్చేస్తే అప్పటి నుంచి అయినా ప్రమోషనల్ మెటీరియల్ మరో లెవల్లో ఉంటుందనే ఆశిస్తున్నారు. మరి యువిక్రియేషన్స్ -గోపికృష్ణ - టీసిరీస్ బ్యానర్ల నుంచి సరైన అప్ డేట్ రావాల్సి ఉంటుంది. ఇంతకీ విదేశాల్లో వీఎఫ్ ఎక్స్ కోసం ఇంకా ఎంత కాలం పట్టనుంది? అన్నదానిపైనా మరింత స్పష్టతనిస్తారేమో చూడాలి.
శాటిలైట్ డిజిటల్ డీల్ క్లోజ్:
రాధేశ్యామ్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. డిజిటిల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్ జీ 5 దక్కించుకోనుందని తెలుస్తోంది. అయితే ఈ డీల్ తెలుగు వరుకు మాత్రమే.. హిందీ శాటిలైట్ హక్కుల్ని వేరే ఛానల్ వారు కొనే అవకాశం ఉంది. ప్రతిష్ఠాత్మక రాధే శ్యామ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ - జీ 5 వేదికలపై అభిమానులకు అందుబాటులోకి రానుంది. రాధే శ్యామ్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుండగా తెలుగు- తమిళం- కన్నడ- మలయాళం వెర్షన్లు జీ 5 లో ప్రసారం కానున్నాయి. జీ 5 మల్టీ లింగువల్ వెర్షన్లను ఎంచుకోవడం ఇదే మొదటిసారి.
ఇక రాధేశ్యామ్ థియేట్రికల్ రిలీజ్ గురించిన సమాచారం రిలీజ్ తేదీ అప్ డేట్ తో ముడిపడినది. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ నిర్మించగా హిందీ వెర్షణ్ ని టీసిరీస్ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది.