ప‌రంప‌ర ట్రైల‌ర్: 'ప్ర‌స్థానం' లా ఎమోష‌న‌ల్ రివెంజ్ డ్రామా

Update: 2021-12-27 12:29 GMT
ఎమోష‌న్ తో కూడుకున్న రివెంజ్ డ్రామాలు.. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లు ఇందులోనే ఫ్యామిలీ ఎపిసోడ్స్ క‌నెక్టివిటీ ఉంటే అలాంటి సినిమాలు ఉత్కంఠ‌కు గురి చేస్తాయి. రొటీన్ కామెడీ సినిమాల‌కు భిన్నంగా ఎమోష‌న్ ని క‌నెక్ట్ చేస్తే అవి బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలుస్తాయ‌ని ప్ర‌స్థానం లాంటి సినిమా నిరూపించింది. దేవా క‌ట్టా స్టాండార్డ్ ఏ రేంజులో ఉందో చూపించిన చిత్ర‌మిది. మాట‌లు ఎమోష‌న్ స్క్రీన్ ప్లే డైరెక్ష‌న్ న‌ట‌న ఇలా అన్ని విభాగాల్లో ప్రూవ్ చేసింది ఆ సినిమా. అయితే మ‌ళ్లీ ఆ రేంజులో ఎమోష‌న‌ల్ పొలిటిక‌ల్ ఫ్యామిలీ డ్రామాలేవీ ఇటీవ‌ల రాలేదు.

చూస్తుంటే కాస్త ప్ర‌స్థానం క‌నెక్ష‌న్ తో పొలిటిక‌ల్ రివెంజ్ డ్రామాతో వ‌స్తున్న సిరీస్ గా `ప‌రంప‌ర` క‌నిపిస్తోంది. ఇది వెబ్ సిరీస్ అయినా కానీ జ‌గ‌ప‌తిబాబు- శ‌ర‌త్ కుమార్- న‌వీన్ చంద్ర లాంటి టాప్ కాస్టింగ్ ఇందులో న‌టిస్తున్నారు కాబ‌ట్టి దీని రేంజే వేరుగా క‌నిపిస్తోంది. మ‌నుషులు మారినా కాలం మారినా త‌రాల్లో ప్ర‌తీకారం బ‌తికే ఉంటుంది.. అంటూ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ ఆక‌ట్టుకుంది. చావ‌డం క‌న్నా చంప‌డం క‌ష్టం! అంటూ కిల్ల‌ర్ పాత్ర‌లో న‌వీన్ చంద్ర క‌నిపిస్తే.. నాయుడు కింగ్ మేక‌ర్ అంటే కింగ్ క‌న్నా గొప్పోడు! అంటూ శ‌ర‌త్ కుమార్ పాత్ర‌ను ఎలివేట్ చేయ‌గా.. జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌ను కూడా పెద్ద మ‌నిషిగా ఎలివేట్ చేశారు. ఇక మ‌నిషిని శాసించేది. ఓటు- నోటు అంటూ రాకీయాల్ని ట‌చ్ చేస్తున్నారు. నాయుడు వ‌ర్సెస్ న‌వీన్ చంద్ర స్టోరి ఏంట‌న్న‌ది ఈ సిరీస్ లో చూసి తీరాల్సిందే అన్నంత ఆస‌క్తిక‌రంగా ఉందీ స్టోరి.. `ఆర్ట్ ఆఫ్ వార్` గురించి న‌వీన్ చంద్ర డైలాగ్ ఆక‌ట్టుకుంది.
ఓవ‌రాల్ గా `ప‌రంపర` వెబ్ సిరీస్ ట్రైల‌ర్ మ‌రో ప్ర‌స్థానంలా ఎమోష‌న‌ల్ టింజ్ తో క‌నిపిస్తోంది.

బాహుబ‌లి నిర్మాత‌ల నుంచి..!

మేగ్నమ్ ఓపస్ మూవీ బాహుబలి నిర్మాత సంస్థ ఆర్కా మీడియా ఈ సిరీస్ ని నిర్మిస్తోంది. టీవీ సీరియల్స్.. సినిమాలు.. ఇప్పుడు వెబ్ సిరీస్ ల‌ను ఆర్కా  సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సంస్థ ఓటీటీ వేదిక‌పైకి ప్ర‌వేశించి తొలిగా ప‌రంప‌ర తెర‌కెక్కించింది. శోభు యార్లగడ్డ- ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ సీరిస్‌ శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విశాఖ కు చెందిన‌ వీరనాయుడు (మురళీమోహన్‌) ప్రజల మనిషి. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తన సొంత భూమిని ప్రభుత్వానికి ఇవ్వడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని భూమిని కూడా పేదలకు దానమిచ్చిన మంచి పెద్ద మ‌నిషి అత‌డు. ఆయన కొడుకులు మోహన రావు (జగపతిబాబు).. నాగేంద్ర నాయుడు (శరత్‌ కుమార్‌) పాత్ర‌లు తెర‌పై క‌నిపిస్తాయి.  ఒకే ఇంటిలో ఉంటూ ప్రత్యర్థుల్లా వ్యవహరించే అన్నదమ్ముల క‌థ‌.. ఫ్యామిలీ డ్రామా పొలిటిక‌ల్ స్టంట్ ప్ర‌తిదీ ఆక‌ట్టుకుంటాయి. అధికారం రాజ‌కీయం ఆధిప‌త్యం చుట్టూ క‌థాంశం తిరుగుతుంది.
Full View
Tags:    

Similar News