ఒక దర్శకుడు లేదా రచయిత చాలా వరకు ఒక కథ రాస్తున్నపుడే అందులో ప్రధాన పాత్రలకు ఫలానా నటీనటులైతే బాగుంటుందని ఫీలవుతారు. ముందు తాము అనుకున్న వాళ్లకే కథలు చెబుతారు. కానీ వాళ్ల అభిప్రాయాలు.. ఆ నటీనటుల అభిప్రాయాలు కలుస్తాయన్న గ్యారెంటీ ఏమీ లేదు. ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి ముందు అనుకున్న హీరో అల్లు అర్జున్ అట. ఐతే బన్నీకి కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయాడట. దీంతో ఈ కథ విజయ్ దేవరకొండ దగ్గరికెళ్లింది. ఐతే ఈ బదిలీ సింపుల్ గానే జరిగిపోయింది కానీ.. హీరోయిన్ సంగతే ఒక పట్టాన తేలలేదట. ఈ కథ విన్నపుడు బన్నీ.. హీరోయిన్ పాత్ర బాగా నచ్చి.. తనకు బాగా క్లోజ్ అయిన ఇద్దరు ముగ్గురు హీరోయిన్లకు చెప్పాడట.
ఒకవేళ ఈ కథ మీ దగ్గరికి వస్తే వదులుకోవద్దని సలహా ఇచ్చాడట. కానీ వాళ్లెవ్వరూ కూడా ఈ సినిమా చేయలేదని బన్నీ వెల్లడించడం విశేషం. ఇదే విషయంలో పరశురామ్.. అల్లు అరవింద్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. హీరోయిన్ ఎంపిక దగ్గరే మూడు నెలలు ఆగాల్సి వచ్చిందన్నారు. పరశురామ్ మాట్లాడుతూ.. హీరోయిన్ ఎంపిక విషయంలో జరిగిన కథంతా చెబితే పెద్ద గొడవైపోతుందన్నట్లు మాట్లాడటం విశేషం. మరి గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో.. బన్నీ ప్రత్యేకంగా సజెస్ట్ చేసినా కూడా ఈ సినిమా చేయడానికి నిరాకరించిన హీరోయిన్లెవరన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోయిన్లు భయపడేంత విషయం ఆ పాత్రలో ఏముంది.. రష్మిక గురించి అందరూ చాలా గొప్పగా చెప్పేంతలా ఆమె ఈ పాత్రలో ఏం ప్రత్యేకత చూపించింది అన్నది ఆసక్తికరమే. చూద్దాం మరి ఆగస్టు 15న గీత క్యారెక్టర్ సంగతేంటో?