తారక్ స్టొరీనే తిరగేసి మహేష్ కి చెప్పారా?

Update: 2019-05-19 06:18 GMT
మహర్షి విజయానందంలో మునిగి తేలుతున్న మహేష్ బాబు వరల్డ్ కప్ ప్లస్ వెకేషన్ కోసం యుకే వెళ్లి తిరిగి వచ్చాక కొత్త సినిమాల పనిలో పడతాడు. ఈ లోగా అనిల్ రావిపూడి ఫుల్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంటాడు. ఎలాగూ సంక్రాంతికి ఖచ్చితంగా విడుదల చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి షూటింగ్ వేగంగానే చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అనిల్ పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా పరశురామ్ కొద్దిరోజుల క్రితం మహేష్ కు ఓ లైన్ చెప్పాడని అది నచ్చి ఫుల్ నెరేషన్ తో రమ్మని చెప్పాడని ఓ న్యూస్ వచ్చింది.

ఇప్పుడు మరో అప్ డేట్ ఏంటంటే దాని థీమ్ గురించి ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం బ్యాంకర్ గా ఉండే మహేష్ తల్లి విలన్ చేసిన ఆర్థిక నేరాల వల్ల నిందను భరించి ఉద్యోగానికి దూరం కావాల్సి వస్తుంది. దాంతో విదేశాలకు పారిపోయిన అతన్ని పట్టుకోవడం కోసం హీరో చేసే పోరాటం మైండ్ గేమ్ ఆధారంగా మంచి టెంపోతో స్టొరీ సాగుతుందట

చదువుతుంటే అచ్చం నాన్నకు ప్రేమతో కథను రివర్స్ లో చదివినట్టు ఉంది కదూ. అందులో విలన్ జగపతిబాబు తారక్ నాన్న రాజేంద్ర ప్రసాద్ ని మోసం చేసి రోడ్డున వేస్తాడు. తెలివితేటలతో హీరో ప్రతీకారం తీర్చుకోవడం అందులో పాయింట్. ఇది రివర్స్. నాన్న బదులు అమ్మకు అన్యాయం జరుగుతుంది. హీరో విలన్ మీద రివెంజ్ పూర్తి చేస్తాడు.

ఇది నిజమో కాదో కాని ఒకవేళ ఈ లైన్ మహేష్ కి నచ్చి ఉంటె మాత్రం కాస్త నాన్నకు ప్రేమతో మీద ఓ లుక్ వేయడం బెటర్. అనిల్ రావిపూడి తర్వాత ప్రిన్స్ కోసం క్యులో పరశురాంతో పాటు సందీప్ వంగా సుకుమార్ లు ఉన్నారు. త్రివిక్రమ్ తో చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ కన్ఫ్యూజన్ అంతా తీరాలంటే ఇంకో రెండు మూడు నెలలు వెయిట్ చేయక తప్పదు అధికారిక ప్రకటన వచ్చే దాకా


Tags:    

Similar News