బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విరాట్ సతీమణి అనుష్క శర్మ పెళ్లి తరువాత రిలీజ్ చేస్తోన్న మొదటి సినిమా పారి. పూర్తిగా హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా కోసం ప్రస్తుతం నార్త్ ప్రేక్షకులు చాలానే వెయిట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా టీజర్ లతో బయటపెట్టిన అనుష్క ఇప్పుడు ట్రైలర్ తో సినిమాను చూడాల్సిందే అనేలా ఒక మెస్సేజ్ ఇచ్చేసింది. డెవిల్ ఎవ్వరిని వదిలిపెట్టదు అనేలా ట్రైలర్ భయాన్ని రేపుతోంది.
గత టీజర్స్ లలో అనుష్క తన పాత్రను ఎక్కువగా చూపించింది. కొన్ని షాట్స్ లలో అసలు కాన్సెప్ట్ ఇది అనేలా చూపించారు. ఇక ట్రైలర్ చూశాకా ఒక క్లారిటీ వచ్చింది. సినిమాలో హీరో పై దెయ్యం కన్ను పడినట్లు తెలుస్తోంది. అది చంపడానికి ప్రయత్నిస్తోంది.. బయటకి వచ్చేసింది అంటూ అనుష్క చెప్పడం కొంచెం రొటీన్ హర్రర్ సినిమాలనే అనిపించినా అమ్మడు తన నటనతో సినిమాను లాగేలా ఉందని అర్ధం చేసుకోవచ్చు, నటన పరంగానే కాకుండా డెవిల్ ఎమోషన్ ఎలా ఉంటుందో ఊహలకు అందేలా సినిమాలో చూపిస్తారట.
అనుష్క ఎంత ఇష్టంగా చేసిన ఈ సినిమాను తనే సొంతంగా నిర్మించుకుంది. ఇక పారి సినిమా వచ్చే నెల మార్చ్ 2న హోలీ పండగ సందర్బంగా విడుదల కానుంది. ప్రోసిట్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనుపమ్ రాయ్ మ్యూజిక్ అందించాడు. సినిమా విడుదలకు ముందు అనుష్క విరాట్ కోసం స్పెషల్ షో వేయనున్నట్లు సమాచారం.