కథానాయికలు ఇదివరకు సెల్యూలాయిడ్ పై మాత్రమే గ్లామర్ ని ప్రదర్శించేవారు. మరిప్పుడో... అవకాశం దొరికిన ప్రతిచోటా అందాల ప్రదర్శనే. నలుగురి దృష్టిలో పడటానికే ఆ ప్రయత్నం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అనే తేడా లేకుండా ప్రతి చోటకీ అందంగా ముస్తాబై వెళుతుంటారు. ఇక పార్టీలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రత్యేకంగా డ్రెస్సుల్ని డిజైన్ చేయించుకొని మరీ అంగాంగ ప్రదర్శన చేస్తూ అక్కడ అదరగొడుతుంటారు. వెళుతూ వెళుతూ ఇలా ఫొటోలకి పోజులు కూడా ఇస్తూంటారు. అలాంటి చోటే గ్లామర్ క్లిక్కయితే ఆ హీరోయిన్లకి వచ్చే మైలేజీ వేరు. అందుకే ఒకరికొకరు పోటాపోటీగా డ్రెస్ చేసుకొని వెళుతుంటారు. పార్టీల సంస్కృతి బాలీవుడ్ లో అయితే మరీ ఎక్కువ.
అక్కడ తరచుగా ఎవరో ఒకరు పెద్దయెత్తున పార్టీ అరేంజ్ చేస్తూ తోటి నటీనటుల్ని ఆహ్వానిస్తుంటారు. అందాలంటే అక్కడే చూడాలి. ఇదిగో నవతరం భామలు పరిణీతి చోప్రా - శ్రద్ధాకపూర్ లు కూడా ఏదో పార్టీకి వెళ్లినట్టున్నారు. పిక్కలదాకే డ్రెస్ చేసుకొని - పొడుగుకాళ్ల అందాల్ని ప్రదర్శిస్తూ ఎంచక్కా ఫొటోకి పోజిచ్చారు. ఈ పోరీల గ్లామర్ దర్శకనిర్మాతల దృష్టిలో పడకపోతుందా? వాళ్లకి పిలిచి మరీ అవకాశాలివ్వకపోతారా? ప్రస్తుతానికి మీరైతే వీళ్ల గ్లామర్ ని చూసి ఆస్వాదించేయండి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/