పారి అలియాస్ పరిణీతి పరిచయం అవసరం లేదు. అమెరికా కోడలు ప్రియాంక చోప్రా సోదరిగా ప్రపంచం ఎపుడో వోన్ చేసుకుంది. బొద్దుగా ఉన్నా ముద్దొచ్చే అమ్మాయిగా బాలీవుడ్ లోగిళ్లలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న పరిణీతి ఇటీవల బరువు తగ్గేందుకు చాలానే కసరత్తులు చేసింది. ఆ హార్డ్ వర్క్ ఫలించి ఇప్పుడు ఎంతో ట్రిమ్ గా కనిపిస్తోంది. ఈ అమ్మడిని ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టులు వరిస్తున్నాయి.
సోషల్ మీడియాలోనూ పరిణీతికి భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే నిరంతరం తన అభిమానుల్ని నిరాశపరచకుండా రకరకాల ఫోటోల్ని అప్ లోడ్ చేస్తోంది. తాజాగా మరో హాట్ ఫోటోని పరిణీతి రివీల్ చేసింది. బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో పరిణీతి సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోని ప్రస్తుతం అభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ గా షేర్ చేస్తున్నారు. ``వాళ్లు గ్లామరస్ గా కనిపిస్తావన్నారు.. నేను బ్లాక్ అనే భావిస్తున్నా! అంటూ గమ్మత్తయిన కొటేషన్ నే ఇచ్చింది ఈ ఫోటోకి.
ఇక పారి నటించే తదుపరి చిత్రం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పాపులారిటీ తెచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితకథలో నటిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పేసుకుంటోంది పరిణీతి. సైనా పాత్రలో పరకాయం చేసేందుకు రెగ్యులర్ గా ఆటను ప్రాక్టీస్ చేస్తోంది. ఇంతకుముందు ఇండోర్ ఆట స్థలంలో చెమటలతో తడిసి ముద్దయిన ఫోటోల్ని పరిణీతి షేర్ చేసింది. ఇక ఈ కష్టం ఫలించి సినిమా విజయం సాధిస్తే మరింతగా పేరొచ్చేస్తుందనడంలో సందేహం లేదు.