బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్ బయోపిక్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓవైపు పుల్లెల గోపిచంద్ బయోపిక్.. మరోవైపు సానియా బయోపిక్ గురించి వైరల్ గా ముచ్చటించుకుంటున్న వేళ సైనా బయోపిక్ పైనా అందరికీ ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ బయోపిక్ గురించి చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నా.. ఎందుకనో రకరకాల కారణాలతో ఆలస్యమైంది.
తొలుత సైనా పాత్రకు శ్రద్ధా కపూర్ ఎంపికైంది. శ్రద్ధా చాలా కాలం బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుని ఎందుకనో నిర్మాతలతో మనస్ఫర్థలు వచ్చి ప్రాజెక్టు నుంచి దూరమైంది. ఆ తర్వాత పరిణీతి చోప్రా ఈ బయోపిక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కారణం ఏదైనా ఈ ప్రాజెక్టు మళ్లీ మొదటికే వచ్చినట్టయ్యింది. ప్రస్తుతం పరిణీతి బ్యాడ్మింటన్ అకాడెమీలకు వెళ్లి చెమటోడుస్తోంది. బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తూ అచ్చం సైనాలా ఆడేందుకు చాలానే శ్రమిస్తోంది.
సైనా బాడీ లాంగ్వేజ్ సహా ప్రతిదీ కుదిరేలా ప్రయత్నం అయితే చేస్తోంది. తాజాగా థానే బ్యాడ్మింటన్ అకాడెమీలో ఇదిగో ఇలా చెమటలు చిందిస్తూ కనిపించింది. ఆటలాడడం అంత వీజీనా? ఎంతో శ్రమించాల్సి ఉంటుందని పరిణీతికి అర్థమై ఉంటుంది. అయితే ఎంపిక చేసుకున్న పాత్రకోసం కఠోరంగా శ్రమించడం తనకు తొలి నుంచి అలవాటు. అందుకే ఈసారి కూడా ఏమాత్రం భేషజానికి పోకుండా ఇలా ప్రిపేరవుతోంది. డేర్ టు డ్రీమ్.. స్ట్రైవ్ టు అఛీవ్! అంటూ పరిణీతిని అభిమానులు ఎంకరేజ్ చేస్తున్నారు. అమోల్ గుప్తా దర్శకత్వంలో టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్ ని పాన్ ఇండియా కేటగిరీలో చేర్చి దర్శకనిర్మాతలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.