సముద్రాన్ని శుభ్రం చేస్తున్న స్టార్ బ్యూటీ

Update: 2022-06-21 02:30 GMT
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణితి చోప్రా స్టార్ హీరోయిన్ గా ఎంత క్రేజ్ అందుకున్నప్పటికి కూడా సింపుల్ గానే ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో కొంత గ్లామర్ డోస్ కూడా పెంచింది.

ఇక పర్యావరణాన్ని ఎక్కువగా ఇష్టపడే పరిణితి చోప్రా ఎక్కువగా నేచర్ బాగుండే ప్రదేశాల్లోనే హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తుంటుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ ఒక హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేయడమే కాకుండా అందరికి ఒక మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం సముద్రాలు మానవాళి పొరపాటు కారణంగా తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఎక్కడ చూసినా కూడా సముద్రంలో చాలా వరకు ప్లాస్టిక్ చేత్తతో నిండిపోయింది అని అందుకే వాటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా మనమీదే ఉందని పరిణితి వివరణ ఇస్తోంది. ఇటీవల అమ్మడు స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలో ఉన్న చెత్తా చెదరాన్ని తీసేసిన ఒక వీడియో కూడా షేర్ చేసుకుంది.

ఆ వీడియోలో పోస్ట్ చేయడమే కాకుండా తనతో పాటు ఈ సముద్రన్ని శుభ్రం చేయడానికి మీరు కూడా భాగం కావాలి అని పిలుపునిచ్చింది. ఇక ఆ వీడియో పోస్ట్ చేయగానే మంచి రెస్పాన్స్ వచ్చింది.

సింపుల్ గా ఉండే పరిణీతి మరోసారి తన మంచి మనసును చాటుకుంది అని మిగతా హీరోయిన్స్ లా కాకుండా ఒక మంచి సందేశంతో పర్యావరణ పరిరక్షణలో భాగం అవుతుండడం మెచ్చుకోదగిన విషయమని అంటున్నారు.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా బాలీవుడ్ లో అన్ని వర్గాల హీరోలతో సినిమాలు చేస్తున్న పరిణితి త్వరలోనే ఒక టాలీవుడ్ హీరోతో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో కొన్ని టాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఈ బ్యూటీ కథలు నచ్చక ఓకే చేయలేదు. మరి ఇప్పుడు వచ్చే ఆఫర్స్ కు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.


Full View
Tags:    

Similar News