స‌ముద్ర గ‌ర్భంలో చేప‌లా సాగ‌ర‌క‌న్య‌ విన్యాసాలు

Update: 2021-10-01 00:30 GMT
బాలీవుడ్ హీరోయిన్ ప‌నిణీతి చోప్రా అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్ అంటే ప‌డి చ‌స్తుందన్న సంగ‌తి తెలిసిందే. ప‌లుమార్లు డీప్ సీలో అండ‌ర్ వాట‌ర్ డైవింగ్ తో సాహ‌సాలు చేసింది. పారీకి స్క్యూబా డైవింగ్ అంటే పిచ్చి. ఇటీవ‌ల `సైనా` బ‌యోపిక్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ప‌రిణీతి కెరీర్ ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వాట‌ర్ స్పోర్ట్స్ ని ఆశ్ర‌యిస్తుంది.

తాజాగా స్కూబా డైవ్ లో త‌న డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకునే ప‌నిలో బిజీగా వుంది. త‌న సోద‌రుడు శివాంగ్ చోప్రాతో క‌లిసి ఏడు రోజుల పాటు స్క్యూబా డైవింగ్ ట్రిప్ లో య‌మ బిజీగా గ‌డిపేస్తోంది. తాజాగా ఈ ట్రిప్ కి సంబంధించిన ఫొటోల‌ని..వీడియోల‌ని ప‌రిణీతి అభిమానుల‌తో పంచుకుంది.

స్కూబా డైవింగ్ సెష‌న్ లో స‌ముద్ర‌పు నీటి అడుగున ర‌కర‌కాల చేప‌ల మ‌ధ్య ప‌రిణీతి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు.. చేప‌ల‌తో ప‌రిణీతి ఆడుకుంటున్న ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. ప‌రిణీతి షేర్ చేసిన వీడియో.. ఫొటోల‌కు ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి. స్కూబా డైవింగ్ ట్రైన‌ర్‌.. నిర్మాత హోమి అద‌జానియా ఈ సంద‌ర్భంగా స్పందించారు. ప‌రిణీతి స్వ‌చ్ఛ‌మైన ఆనందం అని కామెంట్ చేశారు.

ఇక ప‌రిణీతి చోప్రా కూడా త‌న స్కూబా డైవింగ్ కి సంబంధించిన ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని పంచుకుంది. స్కూబా డైవింగ్ కోసం అనువైన ప్ర‌దేశానికి వెళ్ల‌డానికి మేము ప్ర‌యాణిస్తున్న ప‌డ‌వ ఓ పెద్ద ఛాన‌ల్ ని దాటుతోంది. అప్ప‌టి వ‌ర‌కు మేము నిద్ర‌పోతాము.. విశ్రాంతి తీసుకుంటాము. ఆట‌లు ఆడి సేద‌తీరిన త‌రువాతే స్కూబా డైవింగ్ కి సిద్ధ‌మ‌వుతాము. ఈ అద్భుత‌మైన క్ష‌ణాల‌ని క్యాప్ష‌ర్ చేసినందుకు సోద‌రుడు శివాంగ్ చోప్రాకు కృత‌జ్ఞ‌త‌లు అని తెలిపింది.

గ‌త వారం ప‌రిణీతి చోప్రా త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మాల్దీవ్ ల‌కు వెళ్లింది. సీప్లేన్ కు సంబంధించిన ఫొటోల‌ను వీడియోల‌ను అభిమానుల‌తో షేర్ చేసింది. ఇవ‌న్నీ వైర‌ల్ గా మారాయి. ఇంత‌కుముందు ప‌రిణీతి ఆస్ట్రేలియా విహార యాత్ర‌లో కంగారూల‌తో దిగిన ఫోటోలు కూడా వెబ్ లో అంతే వైర‌ల్ అయ్యాయి.


Tags:    

Similar News