*సైనా బ‌యోపిక్.. ప‌రిణీతి క‌ష్టాలు అయ్య‌య్యో!

Update: 2019-05-31 08:21 GMT
సైనా నెహ్వాల్ లా బ్యాడ్మింట‌న్ స్టార్ అయిపోవాలంటే అంత సులువా? ఏళ్ల త‌ర‌బ‌డి శిక్ష‌ణ‌.. క‌ఠోర‌మైన సాధ‌న కావాలి. అయితే ఆ ఆట‌తీరును సినిమా కోసం అడాప్ట్ చేసుకోవాల‌న్నా అంత సులువేం కాదు. ఈ సంగ‌తిని ప్రాక్టికల్ గా గ్ర‌హించిన‌ట్టుంది పారి అలియాస్ ప‌రిణీతి చోప్రా. సైనా నెహ్వాల్ బ‌యోపిక్ కి సంత‌కం చేసేసినంత సులువు కాదు న‌టించ‌డం అని గ్ర‌హించింది. అందుకే ప్ర‌స్తుతం తాను ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డికి ఓ సుశిక్షితుడైన‌ బ్యాడ్మింట‌న్ కోచ్ ని వెంట పెట్టుకుని మ‌రీ వెళుతోంద‌ట‌.

తాను న‌టించిన సినిమా ఏదైనా రిలీజ‌వుతుంటే ప్ర‌చారానికి వెళ్లినా.. లేదూ లండ‌న్ .. ఆస్ట్రేలియాలో షూటింగ్ ప‌ర్ప‌స్ వెళ్లినా అక్క‌డికి ఈ అమ్మ‌డు త‌న వెంట కోచ్ ని తీసుకెళుతోంద‌ట‌. అంటే దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఆ పాత్ర ను పండించ‌డం కోసం.. సైనాలా మారిపోవ‌డం కోసం పారి ఎంత‌గా త‌పిస్తోందో! వాస్త‌వానికి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ గురించి రెండేళ్లుగా స‌న్నాహ‌కాల్లోనే ఉన్నారు మేక‌ర్స్. అమోల్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో టీసిరీస్ భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ‌యోపిక్ గ‌త ఏడాది ప్రారంభం కావాల్సిన‌దే. కానీ అప్ప‌టికే ఎంపిక చేసుకున్న శ్ర‌ద్ధా క‌పూర్ తో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు విభేధాలొచ్చాయి. సైనా పాత్ర కోసం బ్యాడ్మింట‌న్ ప్రాక్టీస్ చేసిన శ్ర‌ద్ధా ఎంతో అశ్ర‌ద్ధ‌గా ఉండ‌డంతో అది మేక‌ర్స్ కి న‌చ్చ‌లేదు. దాంతో త‌నని ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పిస్తున్నామ‌ని నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే శ్ర‌ద్ధాకు వ‌రుస‌గా భారీ ప్రాజెక్టులు క్యూ క‌ట్ట‌డంతో సైనా ప్రాజెక్టుపై దృష్టి సారించ‌లేద‌ని రివీలైంది. సైనాని క‌లిసి బ్యాడ్మింట‌న్ కోసం టిప్స్ తీసుకుని ప్రాక్టీస్ చేశాక చివ‌రికి వ‌దులుకుంది.

ఆ క్ర‌మంలోనే ఈ ప్రాజెక్టుకు సంత‌కం చేసిన పారి ప్ర‌స్తుతం ఆట‌పై దృష్టి సారించింద‌ట‌. కొంత కాలంగా ఆట‌త‌నే గ‌డిపేస్తోంది. అయితే పారీకి టెన్నిస్ ఆట‌కు స‌రిప‌డే ఫిట్ నెస్ లేదు. అందుకే ట్రైనింగ్ ఇస్తున్నారు... పాపం సుకుమారి చాలా క‌ష్ట‌ప‌డుతోందట‌. శ్ర‌ద్ధా త‌ప్పుకున్నాక ఏడాది టైమ్ వేస్ట్ అయ్యింది. ఇక‌నైనా ప‌రిణీతి వేగంగా ప్రాక్టీస్ చేసి సినిమా యూనిట్ కి స‌హ‌క‌రిస్తుందేమో చూడాలి. మ‌రోవైపు ప‌రిణీతి న‌టించిన `జ‌బారియా జోడీ` రిలీజ్ కి రెడీ అవుతోంది. ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్ ఇన్ లండ‌న్ అనే హాలీవుడ్ సినిమాకి అధికారిక రీమేక్ ఇది. సైనా బ‌యోపిక్ బ‌హుశా ప‌రిణీతి కెరియ‌ర్ లోనే బిగ్‌ ఛాలెంజింగ్ అని చెప్పాలి!!


Tags:    

Similar News