బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సంచలనాల గురించి తెలిసిందే. ఈ హైదరాబాదీ సెన్సేషన్ కెరీర్ లో సాధించిన ఘనత ఎంతో. అవార్డులు రివార్డులకు కొదవే లేదు. నేటి తరం క్రీడాకారులందరికీ సైనా గొప్ప స్ఫూర్తి. అందుకే తన జీవితకథను వెండితెరకెక్కిస్తున్నారు అనగానే తెలుగు యువతలో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.
బయోపిక్ ల ట్రెండ్ లో సైనా బయోపిక్ తీస్తున్నందుకు ఆనందం వ్యక్తం అయ్యింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకనో అంతకంతకు ఆలస్యమవుతూనే ఉంది. పైగా కథానాయికల మార్పుపైనా ఆసక్తికర చర్చ సాగింది. సైనా పాత్రలో తొలుత శ్రద్దా కపూర్ నటిస్తుందని ప్రకటించారు. ఆ పాత్ర ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ కి వచ్చి సైనాని తనని అంత గొప్పగా తీర్చిదిద్దిన గురువు పుల్లెల గోపిచంద్ ని కలవడమే గాక బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకుంది.
అయితే శ్రద్ధా కపూర్ కి ఉన్న ఇతరత్రా కమిట్ మెంట్స్ వల్ల దీనిపై పూర్తి శ్రద్ధ కనబరచడం లేదని దర్శకనిర్మాతలు ఆరోపించారు. అటుపై శ్రద్ధా స్థానంలో పరిణీతి ఎంపికైంది. సైనా పాత్ర కోసం సంతకం చేసింది మొదలు పరిణీతి పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి సారించింది. ఇదిగో ఇలా బ్యాడ్మింటన్ ని రేయింబవళ్లు ప్రాక్టీస్ చేస్తోందట. ఇటీవలే గురువు సమక్షంలో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇప్పటికే చాలానే నేర్చుకుందట. తను ఏ తీరుగా శ్రమిస్తోందో ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతోంది. అంతా బాగానే ఉంది కానీ .. ఒకసారి శ్రద్ధా వల్ల వాయిదా పడిన ఈ సినిమా ఇకపై వాయిదా పడకుండా పూర్తవుతుందా? అంటూ సైనా అభిమానుల్లో మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. అమోల్ గుప్తా దర్శకత్వంలో టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్ ని దర్వక నిర్మాతలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారట.