ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకోవడంతో వచ్చిన గుర్తింపును ప్లాట్ ఫాంగా చేసుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టింది ప్రియాంక చోప్రా. తర్వాత కొద్ది కాలంలోనే అన్నవిధాలుగా తన టాలెంట్ చూపి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగి ఇప్పుడు హాలీవుడ్ రేంజికెళ్లింది. ప్రియాంకచోప్రా సోదరి అనే గుర్తింపుతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది పరిణీతిచోప్రా. అయితే తనను ప్రియాంక సోదరిగా చూడటం నచ్చదంటోంది ఈ సొట్టబుగ్గల సుందరాంగి.
‘‘నేను ప్రియాంక సోదరిని అనేమాట నిజమే. మేమిద్దరం ఎప్పటికీ అక్కచెల్లెళ్లమే. కానీ నేను ఓ నటిని. నన్ను పరిణీతి చోప్రాగానే గుర్తించాలని కోరుకుంటా తప్ప ప్రియాంక సిస్టర్ గా కాదు. నేను యాక్టర్ అని గర్వంగా చెప్పుకోగలను. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో వైవిధ్య పాత్రలు చేశా. అదే నాకు గుర్తింపు తెచ్చింది. భవిష్యత్తులో చేసే సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తాను. నాకుగా సొంత గుర్తింపు తెచ్చుకోవాలి. ఈ విషయం చెప్పింది కూడా అక్క ప్రియాంకే’’ అంటూ పరిణీతి మాటల్లో ఎంత పరిణతి సాధించిందో చెప్పుకొచ్చింది.
పరిణీతి ఈమధ్య రెండేళ్లపాటు నటనకు విరామం ఇచ్చి ఫిట్ నెస్ పెంచుకునే పనిలో పడింది. అమ్మడి ప్రయత్నాలు ఫలించి గ్లామరస్ గా తయారైంది. మేరీ ప్యారీ బిందు తో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా గోల్ మాల్ అగైన్ సినిమాలో అందమైన ఆత్మగా కనిపించి అందరినీ మెప్పించింది.