రామ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీని సెట్ చేసిన బోయపాటి!

Update: 2022-02-21 08:22 GMT
బోయపాటి సినిమాల్లో భారీతనం ఉంటుంది .. భారీ తారాగణం ఉంటుంది .. మాస్ మసాలా అంశాలు ఉంటాయి. యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ ట్రాక్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే డ్రామా ఉంటుంది. అందువలన ఆయన సినిమాలను అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇటీవల వచ్చిన 'అఖండ' అదే విషయాన్ని మరోసారి నిరూపించింది.

ఈ సినిమాలో ఆయన యాక్షన్ కీ .. ఎమోషన్ కి మధ్య ఆధ్యాత్మికతను కూడా లింక్ చేయడంతో కాసుల వర్షం కురిసేసింది. అలాంటి బోయపాటి ఆ తరువాత సినిమాను ఎవరితో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఆయన తన నెక్స్ట్ సినిమాను రామ్ తో చేయనున్నాడనే టాక్ వినిపించింది. అది నిజమేనంటూ ఈ కాంబినేషన్ నుంచి ఎనౌన్స్ మెంట్ వచ్చింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. రామ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ముందుగానే ప్రకటించారు. అంటే రామ్ కెరియర్లో ఫస్టు పాన్ ఇండియా సినిమాగా దీనిని గురించి చెప్పుకోవచ్చు.

ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా సినిమా అనగానే బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న భామలపైకే అందరి దృష్టి వెళుతుంది. అందుకు కారణం .. అటు దక్షిణాదిన మార్కెట్ చేసుకోవడం తేలిక అవుతుంది.

సహజంగానే ఉత్తరాది భామలకు దక్షిణాదిన కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అందువల్లనే బోయపాటి కూడా ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ 'పరిణీతి చోప్రాను తీసుకున్నట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది.

బాలీవుడ్ లో పరిణీతికి మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, నాయిక ప్రధానమైన కథలతోను ఆకట్టుకుంది. ఆ సినిమాల జాబితాలో 'మేరీ ప్యారీ బిందు' .. 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' .. 'సైనా' సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రద్ధా కపూర్ .. అలియా భట్ .. అనన్య పాండే మాదిరిగా పరిణితీ చోప్రా కూడా ఈ ఏడాది తెలుగు తెరకి పరిచయమవుతుందన్న మాట.

ఇక రామ్ విషయానికి వస్తే లింగుసామి దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'ది వారియర్' ముగింపు దశకి చేరుకుంది. ఈ ద్విభాషా చిత్రం షూటింగ్ పూర్తికాగానే బోయపాటితో కలిసి ఆయన సెట్స్ పైకి వెళతాడు. 
Tags:    

Similar News