ప్రభాస్- త్రిష జంటగా 2004లో రిలీజైన `వర్షం` సంచలనాల గురించి తెలిసిందే. ఈ సినిమాకి శోభన్ దర్శకత్వం వహిస్తే, పరుచూరి సోదరుల శిష్యుడు వీరూ పోట్ల కథను అందించారు. త్రిషతో ప్రభాస్ రొమాన్స్ ఆన్ స్క్రీన్ ఓ రేంజులో వర్కవుటై డార్లింగ్ కెరీర్ లో మరపురాని హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఆ సినిమా కథలో - కథనంలో అంత గమ్మత్తయిన ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర సంగతిని పరుచూరి గోపాల కృష్ణ తాజాగా `పరుచూరి పాఠాలు` స్క్రీన్ ప్లే క్లాసుల్లో రివీల్ చేశారు. ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి వెంటనే కనెక్టయ్యే ఓ చక్కని పాయింట్ ని పరుచూరి తెలిపారు.
గురూజీ పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ``వర్షం సినిమాకి వీరూ పోట్ల కథ అందించాడు. ఆయన ఈ సినిమాను ఫ్యాక్షన్ నేపథ్యంలో చెప్పాడు. ఈ సినిమాలో ప్రేమకథ ఎక్కువగా వుంది.. కాబట్టి రాయలసీమ నేపథ్యంలో కాకుండా, కాకతీయుల కాలం నుంచి ప్రాధాన్యతను సంతరించుకున్న ఓరుగల్లు నేపథ్యంలో అయితే బాగుంటుంది కదా అన్న అభిప్రాయం వ్యక్తం చేశాను. ఈ మాట వీరుతో పాటు దర్శక నిర్మాతలకూ బాగా నచ్చింది. ఇలా ఈ కథను వరంగల్ వైపు నుంచి చెప్పుకుంటూ వెళ్లడం వలన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది`` అంటూ టాప్ సీక్రెట్ నే వెల్లడించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి నవతరం రచయితలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అప్పటికే ఫ్యాక్షన్ సినిమాల్లో ప్రేమకథల్ని చూపిస్తూ వెళుతున్న తరుణంలో ఇలా ఓరుగల్లు నేపథ్యానికి లవ్‌స్టోరిని మార్చడం వల్లనే `వర్షం` సినిమాకి ఫ్రెష్ నెస్ వచ్చింది. లేదంటే మళ్లీ ఇంకో ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలానే మిగిలిపోయేది వర్షం. అనుభవజ్ఞుడైన పరుచూరి ఇచ్చిన సూచన యంగ్ రైటర్ వీరూకి అలా వర్కవుటైందన్నమాట. ఇకపోతే పరుచూరి సోదరులు ప్రతియేటా ప్రత్యేకించి షార్ట్ టెర్మ్ స్క్రీన్ ప్లే క్లాసులు పేరుతో 3-5 రోజుల పాటు సాగే క్లాసులు చెబుతుంటారు. వాటికి ఎటెండ్ అవ్వాలంటే నామమాత్రపు ఫీజును చెల్లించి చేరాల్సి ఉంటుంది. ఈ క్లాసుల్లో టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గెస్ట్ లెక్చర్లు ఇస్తుంటారు. ఈ క్లాసులకు సంబంధించిన వివరాలు కావాలనుకుంటే - హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలోని రచయితల సంఘంలో కనుక్కోవాల్సి ఉంటుంది.
పరుచూరి తన క్లాసుల్లో జీవితానికి సంబంధించిన మరో మంచి మాటా చెప్పారు. ``కథలో అనుక్షణం మార్పులు ఎలా చేసుకుంటామో జీవితంలో కూడా అంతే. మార్పులు చేసుకున్న కథ ఎలా విజయవంతమౌతుందో - సమయస్ఫూర్తితో సమయానుకూల నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ జీవితం కూడా విజయవంతంగా సాగిపోతుంది. కథలోమార్పులు చేసుకోకపోతే సినిమా దెబ్బ తింటుంది . జీవితంలో భవిష్యత్తు దెబ్బ తింటుంది`` అని ఓ నిత్య సత్యం చెప్పారు.