బాబాయి - అబ్బాయిలను కలిపింది ఈయనేనట!

Update: 2018-10-24 06:59 GMT
నందమూరి ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్న బాబాయి - అబ్బాయి కలయిక ‘అరవింద సమేత’ చిత్రం సక్సెస్‌ వేడుక సందర్బంగా జరిగిన విషయం తెల్సిందే. ఇద్దరి మద్య ఏముందో ఏమో కాని ఇన్నాళ్లుగా ఒకే వేదికపైకి వచ్చింది లేదు. కాని తాజాగా అరవింద సమేత చిత్రం కోసం బాలకృష్ణ - ఎన్టీఆర్‌ లు ఒకే వేదికపైకి రావడంతో నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఎప్పటికి ఇలా బాబాయి, అబ్బాయి కలిసే ఉండాలంటూ నందమూరి ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇకపై ఎలాంటి వివాదం లేకుండా వీరిద్దరు కలిసి ఉంటారని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

ఫ్యాన్స్‌ కోసం కలిసిన బాలకృష్ణ - ఎన్టీఆర్‌ లు మొదటి సారి ఎప్పుడు - ఎలా మాట్లాడుకున్నారు అనే విషయాన్ని పరుచూరి గోపాల కృష్ణ తాజాగా పరుచూరి పలుకులు ద్వారా తెలియజేశారు. బాలకృష్ణ - ఎన్టీఆర్‌ ఒకే కుటుంబంకు చెందిన వారే అయినా కూడా ఎక్కువ సార్లు కలిసింది లేదు - ఎక్కువ సమయం మాట్లాడినది లేదట. ‘అల్లరి రాముడు’ చిత్రం షూటింగ్‌ సమయంలో చిన్న రామయ్య నాతో బాబుయి అంటే తనకు ఎంతో అభిమానమో చెప్పాడు. అప్పుడు బాలయ్య బాబుతో చిన్న రామయ్యను మాట్లాడించాను అంటూ గోపాలకృష్ణ తెలియజేశారు.

అల్లరి రాముడు షూటింగ్‌ కోసం పాలకొల్లులో ఉన్నాం. అప్పుడు మాటల మద్యలో మీకు ఎన్టీ రామారావు గారు ఎంత ఇష్టమో, నాకు బాబాయి బాలకృష్ణ అంటే అంత ఇష్టం. ఆయన సినిమాలకు పేపర్లు చించి మరీ వేశాను అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పారు. ఈ విషయాన్ని బాబాయితో ఎప్పుడైనా చెప్పావా అంటూ నేను అడిగితే బాబాయితో మాట్లాడాలంటే భయం అని ఎన్టీఆర్‌ సమాధానం ఇచ్చాడు. అప్పుడే నేను బాలయ్య బాబుకు ఫోన్‌ చేసి మొదట నేను మాట్లాడి ఆ తర్వాత జూనియర్‌ కు ఫోన్‌ ఇచ్చాను.

మొదటి సారి బాబాయి బాలకృష్ణతో ఎన్టీఆర్‌ ఒక అభిమానిగా చాలా సమయం మాట్లాడాడు. అప్పుడు బాలయ్య బాబు కూడా ఎన్టీఆర్‌ తో సావదానంగా మాట్లాడటం జరిగిందని గోపాలకృష్ణ పేర్కొన్నారు. బాబాయి, అబ్బాయిల మద్య అలా తాను మొదట మాటలు కలిపాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుండి పలు సార్లు బాబాయి సినిమా వేడుకలో అబ్బాయి పాల్గొన్నాడు. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు అబ్బాయి సినిమా వేడుకలో బాబాయి పాల్గొన్నాడు.


Tags:    

Similar News