తాజా ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగిన జనసేనకు ఘోర పరాభవం ఎదురైతే... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అంతకుమించిన పరాభవం తప్పలేదు. మొత్తంగా ఎంతో గొప్పగా రాణిస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశించినా... అస్సలేమీ రాణించకుండానే జనసేన - పవన్ కల్యాణ్ వారి ఆశలను అడియాశలు చేశారు. అయినా అంత మేర ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న పవన్ కల్యాణ్ ఏకంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు కావడం ఏమిటో ఇప్పటికీ ఏ ఒక్కరికీ అంతు చిక్కడం లేదు. అయితే ఆ కారణమేమిటో ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఆ కారణమేమిటంటే... రెండు చోట్ల పోటీ చేసిన పవన్... ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిందే కదా. మరి తమ స్థానానికి రాజీనామా చేస్తారేమోనని ఎవరికి వారే రెండు నియోజకవర్గాల ప్రజలు భావించి... పవన్ కు ఓటేసినా తమ ఎమ్మెల్యేగా ఉండరని భావించారట. అందుకే అటు గాజువాకతో పాటు ఇటు భీమవరం ఓటర్లు కూడా పవన్ కు ఓటేయలేదట.
నిజమే కదా. రెండు చోట్ల పోటీ చేసిన నేత రెండు చోట్ల విజయం సాధిస్తే... ఏదో ఒక స్థానానికి రాజీనామా చేసేయాల్సిందే కదా. సో... మనం గెలిపించినా.. మనకు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం లేని పవన్ కు ఓటేస్తే ఏం లాభమని భావించిన ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు పవన్ ను ఓడించేశారట. ఈ లాజిక్ నిజమే కదా. మరి ఈ లాజిక్ ను బయటకు లాగి.. పవన్ ఓటమికి కారణం చెప్పిన వారెవరంటే... ఇంకెవరు సినిమాల్లో నటుడిగా - రచయితగా - ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పరుచూరి గోపాలృష్ణ ఈ విషయాన్ని కుండబద్లలు కొట్టేశారు. పవన్ కల్యాణ్ ఓటమికి కారణాలు చెప్పిన పరుచూరికి జనసేనానిపై మాత్రం నమ్మకం సడలేదని చెప్పాలి. పవన్ రాజకీయాలపై మాట్లాడిన సందర్భంగా పరుచూరి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.
ఈ దిశగా పరుచూరి ఏమన్నారంటే... ఎన్టీఆర్ తొలి రాజకీయాన్ని తాను చూశానని - ఆయనను ప్రజలు గెలిపించారని - అదే విధంగా ఢిల్లీలో కేజ్రీవాల్ ను కూడా అక్కడి ప్రజలు గెలిపించారని - వారి గెలుపునకు ఆయా సందర్భాల్లో ప్రజల్లో వచ్చిన మార్పే కారణమని పరుచూరి చెప్పారు. అయితే తాజా ఎన్నికల్లో పవన్ పోటీ చేసినా... పవన్ ఆశించిన మార్పు ప్రజల్లో రాలేదని - అయితే ఆ మార్పు కోసం పవన్ ఇంకా శ్రమించాల్సి ఉందని - ఆ దిశగా పవన్ సక్సెస్ అవుతారన్న నమ్మకం తనకుందని చెప్పారు. ఇక తాజా ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని పవన్ కు ముందే అర్థమైపోయిందని కూడా పరుచూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా రాజకీయాలను వదలకుండా పవన్ సాగుతున్న తీరు చూస్తుంటే... ప్రజల్లో మార్పును పవన్ తీసుకొస్తారన్న నమ్మకం తనకుందని పరుచూరి చెప్పుకొచ్చారు. మొత్తంగా ఘోర ఓటమి ఎదురైనా కూడా పవన్ ఏదో సాధిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేసిన పరుచూరి నమ్మకాన్ని పవన్ ఏ మేర సఫలం చేస్తారో చూడాలి.