ఆ హీరోకి హిట్ ఇవ్వలేదనే బాధ వెంటాడుతూనే ఉందట!

Update: 2022-08-04 01:30 GMT
కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో ఫస్టు టైమ్ చారిత్రక నేపథ్యాన్ని టచ్ చేస్తూ 'బింబిసార' సినిమాను నిర్మించాడు. ఈ కథకి సోషియో ఫాంటసీని యాడ్ చేశాడు. అలా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి 'పరుచురూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "నందమూరి కుటుంబంలో ప్రతి వ్యక్తిని నేను ప్రేమిస్తాను. వాళ్లలో కల్యాణ్ రామ్ అంటే మరింత ఇష్టం. ఆయన 'పెదనాన్న' అని పిలిస్తే రక్త సంబంధీకులు పిలిచినట్టుగానే ఉంటుంది.

మా  దురదృష్టం ఏమిటంటే ఆయనకి రాసిన సినిమాలను మేము సక్సెస్ చేయలేకపోయాము. ఇన్నేళ్లుగా ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. తేజ దర్శకత్వంలో 'లక్ష్మీ కల్యాణం' సినిమాను మేము సూపర్ హిట్ చేసే పని. ఆ సినిమాలో సెకండాఫ్ లో కొన్ని జాగ్రత్తలు గనుక తీసుకుని ఉంటే , బాలయ్యబాబుతో మా కాంబినేషన్ మాదిరిగా కల్యాణ్  రామ్ తో కూడా దూసుకుపోయేవాళ్లమేమో అనేది నా ఫీలింగ్. దురదృష్టం వలన ఆ కలయిక కలిసిరాలేదు.

రీసెంట్ గా 'బింబిసార' టీజర్  చూశాను .. ఒళ్లు పులకరించింది.  వాళ్ల తాతగారిని ఆ జానపద గెటప్పులో చూసినవాడిని. కల్యాణ్ రామ్ ని కూడా అలా చూడటంతో అంతే ప్రేమ .. అభిమానం నాలో కలిగాయి. ఆయన అలా 'బింబిసార'గా వస్తుంటే ఈ వయసులో కూడా నాకు ఈల వేయాలనిపించింది. ఇక యూత్ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచన  చేసుకోవచ్చును.

'బింబిసార' అనగానే నేను గూగుల్ లోకి వెళ్లి కథ చదివేశాను. ఆ తరువాత తెలిసింది .. ఇది ఫిక్షనల్  స్టోరీ అని. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ రాజుగాను .. మామూలుగాను కనిపిస్తున్నాడు గనుక, సోషియో ఫాంటసీ అనే విషయం అర్థమైపోతోంది.

నిజం చెప్పాలంటే కల్యాణ్ రామ్ తనకి మించిన బడ్జెట్ ను పెట్టుకున్నాడు. ముందుగా మనల్ని మనం నమ్ముకుంటే ప్రపంచం మనలను నమ్ముతుంది. కల్యాణ్ రామ్ తనని తాను నమ్మి ఈ కథను చేశాడు. కొత్త దర్శకుడు  చాలా బాగా తీశాడు అనే విషయం, ట్రైలర్ ను చూస్తేనే తెలిసిపోయింది.

ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. నేను కూడా థియేటర్ కి వెళ్లి చూడాలనుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. అప్పుడు కల్యాణ్ రామ్ కి కాల్ చేసి అభినందిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News