విశ్వవిఖ్యాత నటసార్వభైముడు ఎన్టీఆర్ తన జీవితంలో చేయని పాత్ర లేదు. వేయని వేషం లేదు. వందలాది రూపాల్లో గొప్ప ఆహార్యంతో మెప్పించారు. అయితే అందులోంచి కొన్నిటిని మాత్రమే సెలక్టివ్ గా ఎంచుకుని వాటిలో బాలయ్య బాబు `కథానాయకుడు` చిత్రంలో అభినయించారని తెలుస్తోంది. ఆ గెటప్పులన్నిటినీ బాలయ్య కోసం ఎంతో శ్రద్ధగా డిజైన్ చేయించారు క్రిష్. దాదాపు 63వేషాల్లో ఎన్టీఆర్ అంటే ఇదిరా అనేలా బాలయ్యను క్రిష్ చూపిస్తున్నాడని పొగిడేశారు పరుచూరి గోపాల కృష్ణ.
దేశంలో ప్రజలకు బ్రహ్మ - విష్ణు - మహేశ్వరుడు దేవుళ్లు.. అయితే తెలుగు ప్రేక్షకులకు దేవుడు అంటే ఎన్టీఆర్ అని అన్నారు పరుచూరి. కథానాయకుడు సినిమాలో 63 పాత్రల్ని చూసి కేంద్ర ప్రభుత్వం కంగారు పడాలి! ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వనందుకు.. ఈ సినిమా చూసి కంగారు పడాలి..! అని వ్యాఖ్యానించారు. ఒక జాతి మొత్తం ఎన్టీఆర్ ని దేవుడిగా చూస్తోంది. పెద్దాయన పాత్రలో బాలయ్య బాబును చూడడం సంతోషంగా ఉంది అని అన్నారు. క్రిష్ ని ఉద్ధేశించి ప్రశంసిస్తూ.. మా 13 వయసులో 14 - 15 - 16 వయసు ఎన్టీఆర్ ని తెరపై చూపించావ్.. ఆ పాత్రల్ని అద్భుతంగా డిజైన్ చేశావ్ అంటూ పొగిడేశారు.
అన్నట్టు ఎన్టీఆర్ మరణానంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరిన సన్నిహిత దిగ్గజాలు ఎవరు అంటే పరుచూరి సోదరుల అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలకు మాటలు - కథలు రాశారు. అన్నగారికి ఎంతో సన్నిహితులు. అందుకే ఆ అభిమానంతో ఇప్పటికీ ప్రతి సందర్భంలో ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని కోరుతూనే ఉంటారు. వారి నోటి వాక్కు ఫలించి ఎన్టీఆర్ కి ఈ సినిమా చూసైనా భారత రత్న ఇస్తారేమో?