బన్నీ కష్టం గురించి చెప్పిన పరుచూరి

Update: 2017-11-16 12:13 GMT
ఓవైపు ‘రుద్రమదేవి’ సినిమాకు నంది అవార్డులు ఇవ్వకపోవడంపై గుణశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అదరగొట్టిన అల్లు అర్జున్ మీద సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ప్రశంసల జల్లు కురిపించారు. పరుచూరి పాఠాలు పేరుతో యూట్యూబ్‌లో తన అనుభవాల్ని, ఆసక్తికర సంగతుల్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన అప్పుడప్పుడూ యువ కథానాయకుల గురించి తన అభిప్రాయం చెబుతుంటారు. తాజాగా ఆయన అల్లు అర్జున్ గురించి మాట్లాడారు.

అల్లు అర్జున్ కీలక పాత్ర చేసిన ‘రుద్రమదేవి’కి తాను రచయితనని.. ఆ సినిమా కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదని పరుచూరి అన్నారు. బన్నీ ఈ పాత్ర తాను చేస్తానంటూ ఉచితంగా నటించడానికి ముందుకు రావడమే కాక.. ఎంతో శ్రద్ధ తీసుకున్నాడని పరుచూరి అన్నారు. ఈ పాత్రకు సంబంధించి తాను కానీ.. దర్శకుడు కానీ.. బన్నీకి ఏమీ సూచించలేదని.. అతనే భాష యాస.. కాస్ట్యూమ్స్ అన్నీ కూడా తనే తన టీంతో కలిసి తీర్చిదిద్దుకున్నాడని చేసుకున్నాడని పరుచూరి తెలిపాడు. ఈ తరం యువ కథానాయకుల్లో ఎంత డెడికేషన్ ఉంది అనడానికి అల్లు అర్జున్ ఈ పాత్రను చేసిన విధానమే ఉదాహరణ అని పరుచూరి అన్నారు. బన్నీ ఎంతో కష్టపడి తన కెరీర్ ను తీర్చిదిద్దుకున్నాడని.. అల్లు అరవింద్ గర్వించదగ్గ విషయం ఇదని.. అతను ఆయనకు కొడుకుగా సరైనోడు అని కితాబిచ్చారు పరుచూరి.
Tags:    

Similar News