చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఇప్పుడు పాత సామెత. సినిమా హిట్ అయ్యాక వాటిని చూసుకుని బాధపడటం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. మలయాళీ హీరొయిన్ పార్వతి నాయర్ చెప్పేది వింటే అయ్యో పాపం అనిపించక మానదు. కారణం కథ నచ్చక వదిలేసుకున్న సినిమాలు చరిత్ర సృష్టించినవి కావడం. ఒక్క సినిమాతోనే శాలిని పాండేని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన అర్జున్ రెడ్డి కథ సందీప్ రెడ్డి వంగా మొదట పార్వతి నాయర్ కే చెప్పాడట. కాని లిప్ టు లిప్ కిస్సింగ్ సీన్స్ ఎక్కువగా ఉండటం - పాత్ర చిత్రణ కూడా చాలా బోల్డ్ గా అనిపించడంతో వద్దు అనుకుంది పార్వతి. పైగా అర్జున్ రెడ్డి కథగా విన్నప్పుడు తనకు ఎగ్జైటింగ్ గా అనిపించలేదని, ఇంత సింపుల్ లవ్ స్టొరీని కొత్త దర్శకుడు ఎలా తెరకెక్కిస్తాడా అనే అనుమానంతో అది వదులుకున్నట్టు చెప్పింది పార్వతి నాయర్.
తీరా సినిమాను థియేటర్లో చూసాక నమ్మశక్యం కాని రీతిలో సందీప్ ఈ సినిమాను మలచిన తీరు చూసి మిస్ చేసుకున్నందుకు చాలా బాధ పడ్డానని వివరించింది. సందీప్ సినిమా తీసిన విధానం తనను పూర్తిగా కాన్సెప్ట్ మీద లవ్ లో పడేలా చేసింది అని చెప్పిన పార్వతి నాయర్ గతాన్ని తలుచుకుని సారీ ఫీల్ అవ్వడం తప్ప ఏమి చేయలేమని చెప్పేసింది. అర్జున్ రెడ్డి ఒక్క హీరొయిన్ విషయంలో మాత్రమే కాదు తను కథ చెప్పిన ఇతర హీరోలు మొదలుకొని బయటి నిర్మాతల దాకా అందరు సందీప్ పనితనాన్ని అనుమానించిన వాళ్ళే. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చే రేంజ్ కి వెళ్ళిపోయాడు సందీప్ రెడ్డి వంగా.
ఇక పార్వతి నాయర్ వదులుకున్న మరో సినిమా అరువి. ఇది కూడా తమిళ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన మూవీ. క్రిటిక్స్ ను కూడా మెప్పించిన ఈ సినిమాలో నటించిన టైటిల్ లీడ్ పోషించిన అదితి బాలన్ కు ప్రశంశలతో పాటు బోలెడు అవార్డులు, రివార్డులు కూడా వరించనున్నాయి. మొత్తానికి లాస్ట్ ఇయర్ ల్యాండ్ మార్క్ గా నిలిచిన ఒక తెలుగు ఒక తమిళ్ సినిమా మిస్ చేసుకున్న పార్వతి నాయర్ ఇకపై కథలను, దర్శకులను తక్కువ అంచనా వేయను అంటోంది. మంచిదేగా.