పటేల్ దెబ్బ గట్టిగానే తగిలేసింది

Update: 2017-08-17 11:46 GMT
స్టైలిష్ విలన్ గా దూసుకుపోతున్న జగపతిబాబు ఇటీవలే 'పటేల్ సార్' అనే సినిమాతో మళ్లీ హీరోగా మారి నాలుక కర్చుకున్న సంగతి తెలిసిందే. విలన్ గా కంటిన్యూ అవుతూనే అప్పుడప్పుడు హీరోగా కనిపిస్తుంటా అని స్టేట్ మెంట్స్ ఇస్తున్న జగపతి.. పటేల్ సార్ తో ఫేట్ మారుతుంది అనుకుంటే.. స్వయంగా ట్వీట్లు పెట్టి రాజమౌళి ప్రమోట్ చేసినా కూడా సీన్ రివర్స్ అయ్యింది. కాని ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడు ఈ సినిమా కారణంగా సినిమాను రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ మాత్రం పటేల్ దెబ్బ గట్టిగా తిన్నాడని అంటున్నారు.

నిజానికి ఈ సినిమాను తన స్నేహితులు కొందర్ని కలుపుకొని జగపతి బాబు ప్రొడ్యూస్ చేసి... తరువాత సాయి కొర్రపాటికి అమ్మేశారట. ఈ డీల్ లో భాగంగా సాయి కొర్రపాటి దాదాపు 5 కోట్లు జగపతికి ఇప్పుడు ఇవ్వాలట. అయితే రిలీజ్ కు ముందు ఈ ఎమౌంట్ జగపతి తీసుకోలేదట. తరువాత చూసుకుందాం అనుకున్నాడట. కాని ఇప్పుడేమో సినిమా ఫ్లాపయ్యాక ఆ నిర్మాత డబ్బులు ఎలా ఇస్తాడు? ఇవ్వడానికి ఇబ్బందిపడుతున్నాడని ఫిలిం నగర్లో టాక్. మరి ఆర్ధికంగా దెబ్బతిన్నా కూడా మాటంటే మాటే కాబట్టి సాయి కొర్రపాటి ఫండ్స్ ఇచ్చేస్తాడా లేదంటే ఫ్లాపు సినిమాను తీసి దగ్గరుండి ముందే అమ్మేసిన జగపతి మనది కూడా తప్పుందిలే అంటూ సర్దుకుపోతాడా అని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఈ మధ్య కాలంలో షార్ట్ గ్యాపులో వారాహి బ్యానర్ నుంచి రెండు సినిమాలు విడుదల అవ్వడం రెండు సినిమాలూ దారుణమైన ఫ్లాప్ అవ్వడం.. సాయి కొర్రపాటిని కూడా బాగా డిస్ర్టబ్ చేశాయట. అందుకే కాస్త ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాడు అంటున్నారు. ఈ విషయాలన్నీ ఎంతవరకు నిజాలో మరి వారాహి వారికే తెలియాలి. చూద్దాం ఈ రూమర్లపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో.
Tags:    

Similar News