పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా తో పాటు క్రిష్ దర్శకత్వం లో #PSPK27 సినిమాలో కూడా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. క్రిష్ ఈ సినిమా కోసం రీసెంట్ గా ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించారని సమాచారం. ఓ ప్రత్యేకమైన సెట్ లో పవన్ - అనసూయ ఇతర బృందంపై ఈ ప్రత్యేక గీతం చిత్రీకరణ జరిగిందని.. సాంగ్ అవుట్ పుట్ బాగుందని టాక్ వినిపిస్తోంది.
పీరియడ్ కథాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారట. సినిమా పూర్తయ్యే సరికి ఈ బడ్జెట్ 250 కోట్ల రూపాయల వరకూ చేరవచ్చనే అంచనాలున్నాయి. మరి ఈ స్థాయి బడ్జెట్ పవన్ మార్కెట్ ప్రకారం వర్క్ అవుట్ అవుతుందా అనే సందేహాలున్నాయి. పవన్ కు తెలుగు రాష్ట్రాల్లో.. కొంతవరకూ కర్ణాటకలో ఫాలోయింగ్ ఉంది కానీ ప్యాన్ ఇండియా ఇమేజ్ లేదు. అలాంటప్పుడు ఇంత పెట్టుబడిని రికవర్ చెయ్యడం కష్టమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా క్రిష్ దర్శకత్వం వహించిన 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఒక దానికి మించి మరొకటి ఫెయిల్యూర్లుగా నిలిచాయి. కంగనా తో తెరకెక్కించిన 'మణికర్ణిక'ను కూడా క్రిష్ పూర్తిగా హ్యాండిల్ చెయ్యలేదు. ఆ సినిమా కూడా భారీ విజయమేమీ సాధించలేదు. మరి ఈ స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాను కమర్షియల్ లెక్కలు వర్క్ అవుట్ అయ్యేలా హిట్ చేయ్యగలడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటుగా ఇలాంటి సినిమాలకు హీరోవైపు నుంచి సహకారం చాలా అవసరం. మరి పవన్ ఈ సినిమాకు అంత సమయం కేటాయించగలరా? ఆయనకు ఉన్న ఇతర కమిట్మెంట్స్ దృష్టిలో ఉంచుకుని చూస్తే క్రిష్ సినిమాకు న్యాయం చెయ్యడం అంత సులువేమీ కాదు. అందుకే ఈ సినిమా లాభసాటి ప్రాజెక్టుగా మారుతుందా లేదా అనేది చర్చనీయంశంగా మారింది.