డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయ పవిత్ర టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమవుతోందా? ఇండస్ర్టీలో మరో లేడీ నిర్మాత ఆవిష్కృతం కాబోతుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పూరి చక్రం తిప్పుతున్నారు. మేకర్ గా టాలీవుడ్ లో పూరి ది ఎంతో సుదీర్ఘమైన ప్రస్థానం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లో లేకుండానే అగ్ర దర్శకుడిగా ఎదిగారు.
మెగాస్టార్ చిరంజీవి మినహా అగ్ర హీరోలందరితోపాటు నవతరం హీరోలతోనూ పనిచేసారు. ఆయన తదానంతరం వారతత్వం కొనసాగేలా వారసుడ్ని సైతం రంగంలోకి దించేసారు. ఆకాష్ పూరి ఇప్పుడిప్పుడే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అటు నిర్మాతగాను పూరి అభిరుచిని చాటుకుంటున్నారు. ఆరంభంలో వైష్ణోఆకాడమీ పేరుతో నిర్మాణంలోకి దిగారు.
అటుపై అదే సంస్థని పూరి కనెక్స్ట్ గా మార్పు చేసి నటి చార్మిని భాగస్వామ్యం చేసుకుని ఆ బాధ్యతలు ఆమెకి అప్పగించారు. మరి ఇప్పుడా బరువు బాధ్యతల్లో పూరి తనయ పవిత్ర కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే పవిత్ర ఎంబీఏ కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ రంగంలోకి ఎంటరైంది. తండ్రి సూచనలు..సలహాలతో ఆ రంగంలో సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.
మరికొద్ది రోజుల్లోనే నిర్మాతగా కూడా ఎంట్రీ ఇస్తుందని ఆకాష్ రివీల్ చేసారు. అంటే ఇక పై పూరి కనెక్స్ట్ బాధ్యతలు పూర్తిగా పవిత్ర చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తండ్రి అగ్ర నిర్మాత...బ్రదర్ కాబోయే స్టార్ . అందుకే పవిత్రని తెలివిగా బిజినెస్ మేనేజ్ మెంట్ చేయించి పూరి ఇప్పుడిలా నిర్మాతగా దించుతున్నట్లు కనిపిస్తుంది.
టాలీవుడ్ లో లేడీ నిర్మాతలు అతికొద్ది మందే ఉన్నారు. అశ్వీనీ దత్ వారసురాళ్లగా స్వప్ప దత్..ప్రియాంక దత్ లు వైజయంతీ మూవీస్ బ్యానర్ ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అలాగే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరిట ఏర్పాటు చేసిన మోహన్ బాబు సంస్థని ఆయన ముద్దుల తనయ లక్ష్మి నిర్వహిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పేరుతో నితిన్ సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా రాణిస్తున్నారు.
ఇప్పుడిదే తరహాలో పూరి తనయ పవిత్ర కూడా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పవిత్ర ఎంట్రీ కూడా ఎంతో కీలకం అని చెప్పాలి. గతంలో పూరి కష్టాన్ని ఓ వ్యక్తి దొచుకుపోయిన సందర్భం ఉంది. ఆ సమయంలో పూరి అప్పుల ఊబిలో సైతం కూరుకుపోయారు. నమ్మిన వ్యక్తే నట్టేంట ముంచాడని పూరి చాలా సందర్భాల్లో అన్నారు.
అప్పటి నుంచి డబ్బు విషయంలో ఎవర్ని బడితే వాళ్లని నమ్మడం లేదని జాగ్రత్త పడినట్లు తెలిపారు. ఈ కారణాలుగాను పూరి తనయని నిర్మాతగా పరిచయం చేయడం వెనుక మరో కారణంగా తెలుస్తుంది. ఒకవేళ పవిత్ర ఎంట్రీ ఇస్తే ఇప్పటివరకూ కీలకంగా మారిన ఛార్మీ బాధ్యతలు ఎంత వరకూ పరిమితమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.