పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్షన్ లోకి దిగబోతున్నారు.. అంటే సినిమా సెట్ లో యాక్షన్ కాదండోయ్ పొలిటికల్ యాక్షన్ కి రెడీ అవుతున్నారు. `వకీల్ సాబ్` తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ప్రకటించి భారీ స్థాయిలో నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారు.
`భీమ్లానాయక్`ని పూర్తి చేశారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఏ.ఎం.రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `హరి హర వీరమల్లు` మూవీలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆగుతూ సాగుతూ.. సాగుతూ ఆగుతూ అన్నపట్టుగా మారింది.
ఈ మూవీ తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో `భవదీయుడు భగత్ సింగ్` ని కూడా చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో సరైన క్లారిటీ లేదు. ఇటీవల `అంటే సుందరానికి` మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం ఈ రెండు సినిమాల్లో నటిస్తానని పవన్ ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగానే సాగుతోంది. ఇదిలా వుంటే తాజాగా జనసేన పార్టీ లీడర్ నాదేండ్ల మనోహర్ ప్రకటన నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేదిలా వుంది.
ఇప్పటికే `హరి హర వీరమల్లు` షూటింగ్ నిరవధికంగా సాగక పోవడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రొడ్యూసర్స్ కి, `భవదీయుడు భగత్ సింగ్` ని ఎప్పుడు మొదలు పెడదామా అని ఆలోచిస్తున్న వారికి తాజాగా జనసేన పార్టీ లీడర్ నాదేండ్ల మనోహర్ రావు చేసిన ప్రకటన కొంత గందరగోళాన్ని కలిగిస్తోంది. మధ్యంతర ఎన్నికలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 5 నుంచి ఏపీ అంతటా పవన్ బస్సు యాత్ర చేపడతారంటూ ప్రకటించారు.
అంతే కాకుండా ఈ యాత్ర ఆరు నెలల పాటు సాగుతుందని బాంబు పేల్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం వుందని భావిస్తున్న పవన్ కల్యాణ్ ఇందులో భాగంగానే ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో `హరి హర వీరమల్లు` షూటింగ్ మొత్తం అక్టోబర్ వరకు పూర్తి కావడం కష్టం. ఇదే కాకుండా హరీష్ శంకర్ `భవదీయుడు భగత్ సింగ్` పట్టాలెక్కాలంటే 2023 వరకు వేచి చూడక తప్పదని తెలుస్తోంది.
ఇదే ఇప్పుడు ప్రొడ్యూసర్లకు ఇబ్బందికరంగా మారబోతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ యాక్షన్ లోకి దిగితే ప్రొడ్యూసర్స్ రియాక్షన్ ఏంటన్నది ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.