పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఉండే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వస్తున్న బర్త్ డే కావడంతో.. అభిమానులు సెలబ్రేషన్స్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. పలు సేవా కార్యక్రమాలు చేయడానికి తలపెట్టారు. అందులోనూ పవన్ నటిస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఉండటంతో ఈసారి పవన్ బర్త్ డే మరింత స్పెషల్ గా మారుతుందని అందరూ ఆశించారు. అయితే ఎందుకనో జనసేనాని పుట్టినరోజు వేడుకలు ఎక్కువ హంగామా సృష్టించలేకపోయాయి.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి తెలిసిందే. సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు. టైమ్ లైన్స్ అన్నీ మిలియన్ల కొద్దీ ట్వీట్ లతో నిండి పోయి ట్విట్టర్ మూమెంట్స్ లో మహేష్ ఫీచర్ రెండు రోజులు ట్రెండింగ్ లో నిలిపారు. ఇదే క్రమంలో ట్విట్టర్ లో ఏర్పాటు చేసిన స్పేస్ సెషన్ 14900 మంది లిజనర్స్ తో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్పేస్ సెషన్ గా నిలిచింది. దీని తర్వాతి స్థానంలో కింగ్ అక్కినేని నాగార్జున - మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పేస్ సెషన్స్ ఉన్నాయి.
ట్విట్టర్ స్పేస్ లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో పీకే అభిమానులు.. పవన్ బర్త్ డే స్పెషల్ గా స్పేస్ సెషన్ నిర్వహించారు. అయితే ఇది 4000 మంది లిజనర్స్ తో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అలానే పుట్టినరోజు అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశకు గురి చేసినట్లు తెలుస్తోంది. 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ పై హైప్ పెంచేసి ఉసూరుమనిపించారు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సాంగ్ తో పలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు.
'హరి హర వీరమల్లు' చిత్రం నుంచి విడుదల తేదీ ప్రకటన తప్ప మరో కొత్త పోస్టర్ రాలేదు. #PSPK28 ప్రీ లుక్ పై ఓ రేంజ్ లో ఉహించుకుంటే.. పవన్ కళ్యాణ్ లుక్ లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు. నాలుగు సినిమాల డిజిటల్ టీమ్ మధ్య ఏకీకృత సమన్వయం లేకనో ఏమో ఏ అప్డేట్ కూడా ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయాయనే కామెంట్స్ వస్తున్నాయి. అన్నీ సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా ఉండేదని చెప్పవచ్చు.