మూడు కాదు ఒక్కటి వచ్చినా ఫ్యాన్స్ హ్యాపీ..!

Update: 2023-01-07 05:07 GMT
చేస్తున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉన్నా రిలీజ్ డేట్ ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నాడు డైరెక్టర్ క్రిష్. అసలైతే 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పవన్ కళ్యాణ్ వల్లే సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఇక ఈ ఇయర్ సమ్మర్ కి సినిమా రిలీజ్ అంటున్నారు కానీ అది కూడా కచ్చితంగా చెప్పడం కష్టం.

ఈ సినిమాతో పాటుగా పవన్ హరీశ్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇదే కాకుండా రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ తో గ్యాంగ్ స్టర్ కథతో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

ఈ రెండు సినిమాలు ఈ ఏడాది పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే మధ్యలో తమిళ సినిమా వినోదయ సీతం సినిమా మీద పవన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సినిమా తెలుగు రీమేక్ లో పవన్, సాయి ధరం తేజ్ నటిస్తారని తెలుస్తుంది.

సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా కోసం కూడా పవన్ ఒక 45 రోజుల డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ ఏడాది పవన్ వీరమల్లు కాకుండానే మరో 3 సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. వీరమల్లు అనుకున్న విధంగా సమ్మర్ కి రిలీజ్ అయితే ఓకే కానీ ఒకవేళ అది కూడా మిస్సైతే మాత్రం 2023 పవన్ సినిమా ఒక్కటి కూడా వచ్చే ఛాన్స్ లేదు.

2024 లో ఎలాగు పవన్ ఎలక్షన్స్ లో బిజీగా ఉంటాడు కాబట్టి ఆ ఇయర్ కూడా ఒక్క సినిమా వస్తుందన్న నమ్మకం లేదు. సో ఎలా చూసినా పవన్ ఫ్యాన్స్ కు ఈ రెండేళ్లు పవర్ స్టార్ సినిమాలు వస్తాయా రావా అన్న డౌట్ మొదలైంది.

పవన్ కళ్యాణ్ కేవలం తను చేస్తున్న సినిమాల మీదే కాదు ఓ పక్క జనసేన కార్యక్రమాలను చూడాల్సి వస్తుంది. అందుకే రెండిటినీ బ్యాలెన్స్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఏడాది కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేలా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అలా చూస్తే వీరమల్లు సినిమాకే ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో పవన్ ఇదివరకు ఎప్పుడూ చేయనటువంటి సరికొత్త పాత్రలో కనిపించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News