ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా భీమ్లా నాయక్ చర్చ జరుగుతోంది. పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ వంటి సినిమా పడింది అంటూ టాక్ వినిపిస్తుంది. భీమ్లా నాయక్ సినిమా లోని మాస్ డైలాగ్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు కాని ఒక్క పాట విషయంలో మాత్రం కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు. ఆ పాట మరీ నాసిరకంగా ఉందని.. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా లేదనే టాక్ వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ పక్కన ఆది మరియు సునీల్ ఇంకా కొందరిని పెట్టి కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ చేసిన సాంగ్ అభిమానులకు పెద్దగా ఎక్కడం లేదు. పవన్ స్టార్ డమ్ కు అది ఏమాత్రం సరిపోవడం లేదని.. సినిమా లో ఆయన మాస్ పాత్రకు.. ఆయన క్యారెక్టర్ అది సరిపోలేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కమెడియన్స్ ను తీసుకు వచ్చి మాస్టర్ చేసిన ప్రయత్నం పెద్దగా సక్సెస్ దక్కించుకోలేక పోయింది.
భీమ్లా నాయక్ సినిమాలోని ఆ పాట విషయంలో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేయడంతో పాటు ఈ సమయంలో సోషల్ మీడియాలో తదుపరి సినిమా యొక్క పాటలకు డాన్స్ కు గణేష్ మాస్టర్ ను ఎంపిక చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్ తదుపరి సినిమా హరి హర వీరమల్లు లో ఎలాగూ ఆయన కొరియోగ్రఫీ ఉండదు.. కనుక హరీష్ శంకర్ సినిమాలో కూడా ఆయన్ను తీసుకోవద్దంటూ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.
భవదీయుడు భగత్ సింగ్ సినిమా లోని పాటల కోసం ముఖ్యంగా ఇంట్రడక్షన్ సాంగ్ కోసం గణేష్ మాస్టర్ ను కాకుండా కొత్తగా ట్రై చేయాలని అభిమానులు ఆశ పడుతున్నారు. గతంలో గణేష్ మాస్టర్ ఎన్నో మాస్ స్టెప్పులు పవన్ తో వేయించాడు. ఆ సమయంలో మంచి సక్సెస్ అయ్యాయి. కాని ఈసారి మాత్రం కాస్త ప్రయోగం వికటించినట్లు అయ్యింది. అయినా పర్వాలేదు ఖచ్చితంగా ముందు ముందు ఆయన పవన్ కోసం మంచి కొరియోగ్రఫీ అందిస్తాడని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భీమ్లా నాయక్ సినిమా వంద కోట్ల వైపు పరుగులు తీస్తున్న ఈ సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి చర్చించాల్సిన అవసరం అస్సలు లేదని అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భీమ్లా నాయక్ సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా లోపాలను ఎత్తి చూపుకుంటూ హ్యాపీనెస్ ను తగ్గించుకోవడం ఎందుకు అంటూ అభిమానులు కొరియోగ్రఫర్ గణేష్ మాస్టర్ గురించి మాట్లాడే వారికి హితవు పలుకుతున్నారు.