స్టార్ హీరో బర్త్ డే అనగానే ఆయనతో సినిమాలు చేయాలని ఒప్పందాలు చేసుకున్న వాళ్లు.. ఆల్ రెడీ సినిమాలు చేస్తున్న వాళ్లు బర్త్ డే సందర్భంగా ఆయా సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింస్స్ వంటివి రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంటారు. తద్వారా అభిమానులల్లో తమ ప్రాజెక్ట్ లపై క్రేజ్ ని, భారీ బజ్ ని క్రియేట్ చేస్తుంటారు. కానీ ఇటీవలే ఓ చిత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలు ఈ సెప్టెంబర్ 2న భారీ స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే.
ఒక్క రోజు ముందుగానే థియేటర్లలకు `జల్సా` 4 కె, తమ్ముడు మూవీస్ రీరిలీజ్ కావడంతో హంగామా మొదలైంది. పుట్టిన రోజున పవన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లు భారీ గా వస్తాయని, దీంతో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పడుతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అది జరగలేదు. ఓన్లీ `హరి హర వీరమల్లు` నుంచి మాత్రమే `పవర్ గ్లాన్స్` పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియోని విడుదల చేశారు.
కరోనాకు ముందు మొదలైన ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా షూటింగ్ ఆగుతూ సాగుతున్న ఈ మూవీ ఎట్టకేలకు ముందుకు సాగుతోందన్న సంకేతాల్ని అందించడానికే `పవర్ గ్లాన్స్` పేరుతో వీడియోని పవన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
త్వరలోనే ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే పవన్ అంగీకరించిన సురేందర్ రెడ్డి మూవీ.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న `భవదీయుడు భగత్ సింగ్`, తమిళ హిట్ మూవీ `వినోధాయ సితం` ఆధారంగా రీమేక్ కానున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లని బర్త్ డే సందర్భంగా ప్రకటించలేదు. మేకర్స్ నుంచి కూడా ఈ ప్రాజక్ట్ ల విషయంలో క్లారిటీ రాలేదు. `భవధీయుడు భగత్ సింగ్` ప్రాజెక్ట్ పై హరీష్ శంకర్ స్పందించి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా వుంటుందని ప్రకటించాడే కానీ మైత్రీ వారి నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇక సురేందర్ రెడ్డి - పవన్ కాంబి నేషన్ లో `యథాకాలం తథా వ్యవహారమ్` అనే ట్యాగ్ లైన్ తో రామ్ తాళ్లూరి నిర్మించే ప్రాజెక్ట్ గురించి అభిమానులు అడిగితే పవన్ బర్త్ డేకు ముందు ఈ సినిమా `ఏజెంట్` తరువాత పట్టాలెక్కుతుందని నిర్మాత క్లారిటీ ఇచ్చారే కానీ పవన్ పుట్టిన రోజున ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదే తరహాలో `వినోధాయ సితం` రీమేక్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఆయోమయానికి గురవుతున్నారట. పవన్ ఈ ప్రాజెక్ట్ లని పొలిటికల్ టూర్ తరువాత పట్టాలెక్కిస్తారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.