పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే హిందీ హిట్ సినిమా 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ తాత్కాలింగా వాయిదా వేసారు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మించనున్నారు. ఆ తర్వాత తన కెరీర్లో 28వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. పవన్ - హరీష్ కాంబోలో ఇంతకముందు వచ్చిన 'గబ్బర్ సింగ్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన పాటలు మంచి ఆదరణ పొందాయి. గబ్బర్ సింగ్ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్బంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఆసక్తకిరమైన ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తన తరువాతి సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను కూడా అభిమానులతో పంచుకున్నాడు.
తాను దర్శకత్వం వహించబోతున్న పవన్ 28వ చిత్రానికి దేవిశ్రీనే మ్యూజిక్ అందించనున్నాడని ఈ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రకటించాడు. 'మేము మళ్ళీ కలిసి వస్తున్నాం.. ఇప్పుడే మొదలైంది' అంటూ ట్వీట్ చేసాడు. అంతేకాకుండా 'గబ్బర్ సింగ్' సినిమాకి పనిచేసిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ లెటర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. షూటింగ్ నిన్న మొన్ననే జరిగిన ఫీలింగ్ తనకు ఉందని.. సోషల్ మీడియా పుణ్యమా అని గబ్బర్ సింగ్ చిత్ర జ్ఞాపకాలు జ్ఞాపకాలు ప్రతి ఏడాది తనతోనే ఉంటున్నాయని.. ఈ చిత్రంలో ఆన్ స్క్రీన్ హీరో పవర్ స్టార్ అయితే ఆఫ్ స్క్రీన్ హీరో దేవిశ్రీ అంటూ చెప్పుకొచ్చాడు. పేరు పేరునా అందరికి థ్యాంక్స్ చెప్తూ ''ఇప్పుడే మొదలైంది'' 'మేము మళ్ళీ కలిసి వస్తున్నాం' అంటూ లెటర్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు హరీష్ శంకర్ పెట్టిన ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అదేంటంటే ఈ ట్వీట్స్ ద్వారా హరీష్ #PSPK 28 టైటిల్ ఏంటనే హింట్ ఇచ్చాడని డిస్కస్ చేస్తున్నారు.
హరీష్ శంకర్ ''ఇప్పుడే మొదలైంది'' అని మెన్షన్ చేయడం వల్ల ఇదే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ టైటిల్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. అందులోనూ హరీష్ పోస్ట్ చేసిన లెటర్ లో ''ఇప్పుడే మొదలైంది'' డిఫరెంట్ ఫాంట్ స్టైల్ లో అదే హైలైట్ అయ్యేలా ఉంది. దీంతో ఇదే నిజమే కదా అనే అనుమానాలు బలంగా రేకెత్తుతున్నాయి. ఇంతకముందు 'పుష్ప' సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. సుకుమార్ ఆరు నెలల క్రితం పెట్టిన ట్వీట్ లో 'PUSHPA' అని సింబల్స్ తో టైటిల్ రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా హరీష్ కూడా అదే ఫాలో అవుతూ పవర్ స్టార్ మూవీ టైటిల్ హింట్ ఇస్తున్నాడేమో అంటూ పీకే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ నేమ్ సోషల్ మీడియా ప్రొఫైల్ నేమ్ గా చేంజ్ చేసారు.