మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా లాంచ్ ఈవెంట్ సోమవారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరయ్యారు. చిరంజీవి.. చిరు అమ్మగారు అంజనాదేవి.. నాగబాబు.. అల్లు అరవింద్.. అల్లు అర్జున్.. వరుణ్ తేజ్.. సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ సినిమా లాంచ్ ఈవెంట్ లో సందడి చేశారు.
మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్ ఏది జరిగినా ఆటోమేటిక్ గా ఒక ప్రశ్న ఎదురువుతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యాడా లేదా అని. ఈ కార్యక్రమానికి పవన్ హాజరు కాలేదని అందరికీ తెలుసు. ఒకవేళ హాజరై ఉంటే ఇప్పటికే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసేవి. పవన్ ఈ కార్యక్రమంలో కనిపించకపోవడానికి రాజకీయాలలో బిజీగా ఉండడం ఒక్కటే కాదట.
ఎన్నికలకు మరి కొద్ది నెలలే మిగిలి ఉన్న ఈ సమయంలో ఫిల్మీ ఈవెంట్స్ కు హాజరయితే పార్ట్ టైమ్ పొలిటిషియన్ అనే విమర్శలకు బలం చేకూర్చినట్టు అవుతుందని.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని జనసేనాని అభిప్రాయపడుతున్నాడట. అందుకే ఇలాంటి ఈవెంట్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట. అదీ ఒకందుకు మంచిదే. పవన్ తన మేనల్లుడి లాంచ్ ఈవెంట్ కు హాజరైనా కాకపోయినా.. మేనమామగా తన దీవెనలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి కదా.