గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీటవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ సీరియస్ పొలిటికల్ డ్రామా తో జనసైనికులు సహా అభిమానుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. భవదీయుడు భగత్ సింగ్ అనే ఆసక్తికర టైటిల్ ని పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా ప్రకటించారు. ఈ హై బడ్జెట్ ఎంటర్ టైనర్ లో పవన్ తో రొమాన్స్ చేయడానికి పూజా హెగ్డే ఫ్రంట్ రన్నర్ గా ఉందని కథనాలొచ్చాయి. గద్దలకొండ గణేష్ తర్వాత పూజా మరోసారి హరీష్ తో సినిమాకి సంతకం చేసిందని గుసగుసలు వైరల్ అయ్యాయి.
పవన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నా హరీష్ కోసం కాల్షీట్లను కేటాయించేందుకు రెడీగా ఉన్నారు. భీమ్లా నాయక్ - హరి హర వీర మల్లు చిత్రాలను పూర్తి చేసిన తర్వాత పవర్ స్టార్ భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 2022 దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ BBS బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే సంక్రాంతి బరిలో పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ విడుదల కానుండగా హరిహర వీరమల్లు చిత్రాన్ని 2022 వేసవి కానుకగా రిలీజ్ చేసే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి - సమ్మర్ అటుపై దసరా .. అంటే చాలా తక్కువ వ్యవధిలో పవన్ నుంచి అభిమానులు ధమాకా ట్రీట్ అందుకోనున్నారు.