దేశం కాని దేశానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్ కళ్యాణ్. ఆస్ట్రేలియాకి చెందిన అన్నా లెజ్నివాని పవన్ వివాహం చేసుకున్నప్పట్నుంచి ప్రతి ఒక్కరూ ఆమె గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ అమ్మాయితో పవన్ కాపురం ఎలా ఉంది? మన వాతావరణానికి ఆమె ఇమిడిపోయిందా? ఇంతకీ ఆమె తెలుగు మాట్లాడుతుందా? ఇలా ఎన్నెన్నో సందేహాలు! వాటన్నిటికీ తీర్చాడు పవన్ కళ్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకొచ్చాడు.
ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత విషయాలు కూడా బయటికొచ్చాయి. పవన్ మూడో భార్య అన్నా లెజ్నివా తెలుగు చదువుతోందట. స్వతహాగా ట్రాన్సిలేటర్ అయిన ఆమె ఒకొక్క పదం పలుకుతూ తెలుగు చదవడం నేర్చుకుంటోందట. ఇంట్లో తెలుగులోనే మాట్లాడ్డానికి ప్రయత్నిస్తోందట. నా ఇల్లు నానా భాషల సమితి అయ్యిందని ఈ సందర్భంగా పవన్ చమత్కరించాడు. ``మా అమ్మాయి ఆద్య మరాఠీలోనే మాట్లాడుతోంది. ఆమె కోసం నేను వచ్చీ రాని మరాఠీ మాట్లాడాలి. ఇంట్లో చిన్నమ్మాయేమో ఇంగ్లీష్ మాట్లాడుతోంది. అసలు ఈ జీవితం నాదేనా లేదంటే వేరొకరి జీవితాన్ని నేను జీవిస్తున్నానా అనిపిస్తుంటుంద``ని పవన్ వ్యాఖ్యానించాడు. అన్నా లెజ్నివా సనాతన క్రైస్తవ మతస్తురాలనీ, తనకీ నాకూ పుట్టిన బిడ్డకి తన సంప్రదాయం ప్రకారమే పేరు పెట్టానని, అలాగే పెంచుతున్నానని పవన్ స్పష్టం చేశాడు.