‘అజ్ఞాతవాసి’ టీజర్.. టెన్షన్ టెన్షన్

Update: 2017-12-16 08:56 GMT
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల చూపంతా ‘అజ్ఞాతవాసి’ మీదే ఉంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్.. ఇందులోని రెండు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పుడు దీని టీజర్ కూడా వచ్చేస్తోంది. డిసెంబరు 16న.. అంటే ఈ రోజే టీజర్ రిలీజ్ అని మూడు రోజుల కిందటే ప్రకటించారు. నిన్న సాయంత్రం నుంచే టీజర్ కోసం సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌ తో పవన్ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టేశారు. టీజర్ రావడం ఆలస్యం వ్యూస్ - లైక్స్ విషయంలో రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐతే టీజర్ రిలీజ్ ఈ రోజన్నారు కానీ.. టైం మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది. ఉదయం నుంచి సోషల్ మీడియాల పడిగాపులు కాస్తున్నారు. ముందు టైం చెప్పకపోతే చెప్పకపోయారు.. కనీసం ఈ రోజు ఉదయం అయినా టీజర్ టైం విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే ఫస్ట్ లుక్ విషయంలో ఇలాగే ముందు టైం ఇచ్చి.. ఆ టైంకి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. సాంకేతిక సమస్యలంటూ రెండు గంటలు ఆలస్యం చేశారు. ఆ టైంలో జనాల ఫ్రస్టేషన్ మామూలుగా లేదు. అందుకే ఎందుకైనా మంచిదని సాయంత్రం 6 గంటలకు టీజర్ వస్తుందని ప్రకటించారు. టీజర్ అయితే చాలా బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News