ప్రపంచంలో ఉన్న చాలా మంది తెలుగు సినిమా ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా గురించి ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా ఎంతవరకు హిట్ అవుతుంది అనేది తరువాత సంగతి కానీ మొదటి రికార్డులు ఏ స్థాయిలో ఉంటాయి అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ కు నిర్మాత అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా అజ్ఞాతవాసి అమెరికాలో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.
దాదాపు 457 స్క్రీన్స్ లలో జనవరి 9న సినిమా ప్రీమియర్స్ షోలు ప్రదర్శించబడనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయని తెలుస్తోంది. అంతే కాకుండా జనవరి 10న ఎర్లీ మార్నింగ్ షోలు ఉంటాయని టాక్. ఇకపోతే అజ్ఞాతవాసి సినిమా రికార్డుల గురించి సినీ ప్రముఖులు లెక్కలు వేస్తున్నారట. బాహుబలి స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుంది అనే అనుమానాలను కలిగిస్తోందని అంటున్నారు.
ముఖ్యంగా ఓపెనింగ్స్ అయితే తప్పకుండా హై రేంజ్ లో ఉంటాయని ఎనలిస్ట్ లు చెబుతున్నారు. బాహుబలి 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.45 కోట్లను క్రాస్ చేసింది. ఇక అమెరికాలో ప్రిమియర్ షోల ద్వారా ఆ సినిమా దాదాపు 2.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. అయితే అజ్ఞాతవాసి అంతకంటే ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవుతోంది కాబట్టి సినిమా కూడా మొదటి రోజు ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టగలుగుతుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.