అజ్ఞాతవాసి అసలు హంగామా రేపే

Update: 2018-01-03 05:36 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ 25వ సినిమా కావడంతో అందరిలోను అంచనాలు భారీగా ఉన్నాయి. తప్పకుండా సినిమా కలెక్షన్స్ పరంగా అలాగే టాగ్స్ పరంగా రచ్చ చేయడం గ్యారెంటీ అని టాలీవుడ్ లో చాలా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆ సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నారు.

అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఎంత హిట్ అవుతుందో గాని రేపు మాత్రం పవన్ ఫ్యాన్స్ అసలు హంగామా స్టార్ట్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సినిమా ట్రైలర్ రేపే రిలీజ్ కాబోతోంది. రేపు సాయత్రం ఆరు గంటలకు ట్రైలర్ ను చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేయనుంది. ఎప్పటి నుంచో దాని కోసమే ఫ్యాన్స్  చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్న టీజర్ నిన్న పవన్ పాడిన పాట ఈ రోజు వరకు రచ్చ చేస్తూనే ఉన్నాయి.

ఇక రేపు ట్రైలర్ రిలీజ్ అయితే మరో కొత్త సెన్సేషన్ క్రియేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీజర్ లో కొంచెం అత్తారింటికి దారేది పోలికలు ఉన్నాయని కొంతమంది కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ట్రైలర్ తో త్రివిక్రమ్ ఆ మచ్చను తొలగిస్తాడా లేదా అనేది చూడాలి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News